జనసేన పార్టీ సీఎ జగన్ పేరును ఇక ఉచ్చరించే అవకాశం లేదు. కొన్నాళ్లుగా పవన్ కల్యాణ్‌ను దత్తపుత్రుడు అంటూ ప్రచారం చేస్తూ.. సోషల్ మీడియాలోనూ అదే హైలెట్ చేస్తున్న వైసీపీకి .. జనసేన పార్టీ షాకివ్వాని నిర్ణయించుకుంది. జగన్ ను సీబీఐ దత్తపుత్రుడిగానే అభివర్ణయించింది. స్వయంగా పవన్ కల్యాణ్ కూడా అదే విధమైన సంబోధన చేయనున్నారు. ఆదివారం విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లోనూ అదే పేర్కొన్నారు.
రైతు భరోసా యాత్రలో పవన్ కల్యాణ్.. రెండు సార్లు వైసీపీ నేతలను హెచ్చరించారు. తనను దత్త పుత్రుడంటే ఇక నుంచి జగన్ ను సీబీఐ దత్తపుత్రుడని పిలుస్తానన్నారు. జగన్ రెండు సార్లు చేసిన హెచ్చరికలను లైట్ తీసుకున్న వైసీపీ నేతలు పవన్‌పై తిట్ల దండకం అందుకుంటున్నారు. ఇక తాము కూడా వెనక్కి తగ్గకూడదని డిసైడయ్యారు. సీబీఐ దత్తుపుత్రుడు గానే జగన్ ను పిలవాలని డిసైడయ్యారు. వైసీపీని చంచల్ గూడ షటిల్ టీంగా పిలవాలని నిర్ణయించుకున్నారు.
జనసేన పార్టీని మానసికంగా కించపరిచి వారి స్థైర్యాన్ని దెబ్బతీయాలనే వ్యూహాన్ని మొదటి నుంచి వైసీపీ నేతలు పాటిస్తున్నారు. ఈ విషయంలో వారు పవన్ ను వ్యక్తిగతంగా విమర్శించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. పవన్ కుటుంబ విషయాలనూ తెరపైకి తెచ్చారు. ఈ క్రమంలో జనసేన పార్టీ ఎదురుదాడికి దిగాలని నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది.