పవన్ కళ్యాణ్ మరో రీమేక్ ఖరారైపోయింది. తమిళంలో సముద్రఖని దర్శకత్వం వహించి, నటించిన వినోదయ సిత్తం సినిమాని పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ భాద్యతలు త్రివిక్రమ్ తీసుకుంటారని ప్రచారం జరిగింది. భీమ్లా నాయక్ ని నడిపించినట్లు అంతా తానై ఉంటారని వినిపించింది. ఐతే ఈ సినిమాకి త్రివిక్రమ్ పని చేయడం లేదు. రీమేక్ స్క్రిప్ట్ భాద్యతలని బుర్రా సాయి మాధవ్ కి అప్పగించారని తెలిసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర సినిమాకి డైలాగ్స్ రాస్తున్న బుర్రా.. ఈ రిమేక్ కు కూడా స్క్రిప్ట్ బాధ్యతలు తీసుకుంటారని సమాచారం. మొదట ఈ సినిమాని త్రివిక్రమ్ చేయాలనుకున్నారు. ఐతే మహేష్ సినిమాతో బిజీగా వుండటం వలన సమయం కుదరలేదు. దీంతో బుర్రా సాయి మాధవ్ కి బాధ్యతలు ఇచ్చారు. ఒరిజినల్ ని డైరెక్ట్ చేసిన సముద్రఖని ఈ రిమేక్ కి దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబధించిన పూర్తి వివరాలు బయటికి వస్తాయి.