ఆచార్యతో నిరాశ పరిచారు కొరటాల శివ. ఆయనకి మొదటి ఫ్లాఫ్ ఆచార్యతో పడింది. దీంతో ఆయన చేయబోయే ఎన్టీఆర్ సినిమాపై ప్రభావం పడుతుందేమో అనే చర్చలు నడిచాయి. ఐతే అవన్నీ పసలేని చర్చలే. ఆచార్యని మర్చిపోయి కొత్త ఉత్తేజంతో ఎన్టీఆర్ సినిమాకి రెడీ అవుతున్నారు కొరటాల. ఎన్టీఆర్ కూడా ఇప్పటికే కొరటాల సినిమా గురించి కసరత్తు మొదలుపెట్టారుల. ఈ సినిమా కోసం బరువు తగ్గారు. ఎన్నడూ లేనంత లీన్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నారు ఎన్టీఆర్. దీని కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు. జూన్ సెకండ్ వీక్ లో షూటింగ్ మొదలుపెడుతున్నారు. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ షాట్ తోనే షూటింగ్ మొదలౌతుంది. ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల మళ్ళీ ఆయనతో సినిమా చేయడం ఆభిమానుల్లో అంచనాలు పెంచుతుంది. త్వరలోనే ఈ సినిమా టెక్నికల్ టీమ్ ని ప్రకటిస్తారు.