సోషల్ మీడియా వచ్చాక… మోసే వాళ్ల సంగతేమో గానీ, కిందకి లాగేసేవాళ్లు, మెడ పట్టుకుని తోసేసేవాళ్లూ ఎక్కువైపోయారు. వాక్ స్వాతంత్ర్యం ఎక్కువై.. ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేయడం మొదలెట్టారు. `ఇతనితో ఈ మాట అనొచ్చా.. లేదా..` అనే ఫిల్టర్లు ఎవరికీ లేవు. దాంతో సెలబ్రెటీలు కొంత ఇబ్బంది పడుతున్నారు. టిక్ ఫర్ టాక్ అనుకునేవాళ్లయితే రెచ్చిపోయి సమాధానం చెప్పి, ఇంకాస్త కాంట్రవర్సీ చేసేస్తున్నారు.
ఇలాంటి కామెంట్లే…. దర్శకుడు కృష్ణవంశీకి ఎదురయ్యాయి. కృష్ణవంశీ ఈమధ్య సోషల్ మీడియాలో కాస్త యాక్టీవ్ గానే ఉంటున్నారు. తరచూ ఎఫ్బీలో పోస్టులు పెడుతున్నారు. మంగళవారం కృష్ణవంశీ ఎఫ్ బీలో ఓ కామెంట్ పెట్టారు. స్టివెన్ స్పీల్ బర్గ్ తీసిన వెస్ట్ సైడ్ స్టోరీస్ సినిమా తీశానని, చాలా బాగా నచ్చిందని కామెంట్ పెట్టారు. దానికి ఓ నెటిజన్..`నీకు అన్నీ ఇంట్రస్టే.. నీకు నీ సినిమా తీసి, విడుదల చేయడం తప్ప` అన్నట్టు కామెంట్ పెట్టాడు. ఏ దర్శకుడికైనా ఇది చిర్రెత్తుకొచ్చే కామెంటే. కృష్ణవంశీలాంటి ఎగ్రసివ్ వ్యక్తులు ఇంకాస్త ఫైర్ అవుతారు ఇలాంటి కామెంట్లు చూసి. కానీ వంశీ కూల్ గా స్పందించారు. `గాడ్ బ్లెస్ యూ.. ` అంటూ ఓ లవ్ సింబల్ తో రిప్లై ఇచ్చారు.
ఈ నెగిటీవ్ కామెంట్లపై విమర్శల వర్షం కొనసాగుతోంది. `కృష్ణవంశీ స్థాయిని, ఆయన తీసిన సినిమాల్ని చూసి మాట్లాడ`మని సదరు నెటిజన్‌పై కృష్ణవంశీ అభిమానులు విరుచుకుపడుతున్నారు. మరోవైపు ఇంత ఈ కామెంట్ పై ఇంత కూల్ గా వ్యవహరించి కృష్ణవంశీ తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నట్టైంది. ఆయన తీసిన `రంగమార్తండ` విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.