ఒక సినిమా ట్రైలర్ హీరోకి కనీసం ఐదు డైలాగులైనా ఉండాల్సిందే. కొన్నిసార్లు ట్రైలర్ మొత్తం హీరో డైలాగులతో నిండిపోతుంది. కానీ రాజశేఖర్ కొత్త సినిమా శేఖర్ ట్రైలర్ ఇందుకు భిన్నంగా వుంది. రాజశేఖర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం శేఖర్. రాజశేఖర్ భార్య జీవిత దర్శకత్వం వహించారు. శివాని రాజశేఖర్ కీలక పాత్ర చేసింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘జోసెఫ్’ చిత్రానికి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ బయటికి వచ్చింది. ఇదో క్రైమ్ థ్రిల్లర్. అరుకు సమీపంలో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ కేసుని పరిశోధనలో సంచలనమైన విషయాలు బయటికివస్తాయి. ట్రైలర్ గ్రిప్పింగా చూపించారు. డైలాగుల తగ్గించి యాక్షన్ ని చూపించారు. రాజశేఖర్ లుక్స్ బావున్నాయి. పోలీసు వుద్యోగాని రాజీనామా చేసి కూడా డ్యూటీ చేసే పాత్రలో శేఖర్ పాత్రని చూపించారు. కథలో కోర్ట్ రూమ్ డ్రామా కూడా వుంది. రాజశేఖర్ కెరీర్లో 91వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంలో ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.