హైదరాబాద్ లోటస్ పాండ్‌లో ఉన్న షర్మిల నివాసానికి ఐ ప్యాక్ ఆఫీసు బోర్డును తగలించారు. ఐ ప్యాక్ అంటే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ. దీని యజమాని ప్రశాంత్ కిషోర్ . ఆయన తన ఐ ప్యాక్‌తో ఎన్నికల్లో సాయం చేసేందుకు టీఆర్ఎస్‌తో ఒప్పందం చేసుకున్నారు. గతంలో ప్రశాంత్ కిషోర్ తనకు సాయం చేస్తారని మాటిచ్చారని చాలా సార్లు షర్మిల ప్రకటించారు. ఒకటి రెండు సార్లు షర్మిల.. పీకేతో కూడా భేటీ అయ్యారన్న ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఆ తర్వాత టీఆర్ఎస్‌తో ఒప్పందం చేసుకున్నారు.
ఇప్పుటు టీఆర్ఎస్ కోసం ఐ ప్యాక్ టీం విస్తృతంగా పని చేస్తోంది. సర్వేలు చేసి రిపోర్టులు కూడా ఇస్తోంది. అయితే అనూహ్యంగా ఇప్పుడు లోటస్ పాండ్‌లోనూ ఆ సంస్థ కార్యాలయం ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. గతంలో జగన్ కోసం పని చేసినప్పుడు లోటస్ పాండ్ సమీపంలోని ఓ భవనంలో ఐప్యాక్‌ను పెట్టారు. ఈ సారి మాత్రం నేరుగా షర్మిల ఇంట్లోనే ఐ ప్యాక్ టీం ఆఫీసు తెరిచారు. రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. దీంతో షర్మిల పార్టీకి కూడా ఐ ప్యాక్ పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఒకే రాష్ట్రంలో రెండు పార్టీలకు పని చేస్తున్న అరుదైన ఘటన ఐ ప్యాక్ సొంతం చేసుకున్నట్లవుతుంది. అయితే ఇది నైతికంగా ఎంత వరకూ కరెక్టో తెలియదు కానీ.. పీకే మాత్రం తన కంపెనీని డబ్బులిస్తే అన్ని పార్టీలకూ ఇచ్చేలాగాఉన్నారు. ఈ ఆఫీసుపై సోషల్ మీడియాలో విస్తృంగా ప్రచారం జరుగుతోంది. ఏపీలో జగన్ కోసం షర్మిల ఇంట్లో ఆఫీసు పెట్టారని కొంత మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.