రాజకీయాల్లోకి రావాలని డిసైడయిన ప్రశాంత్ కిషోర్.. ఏకాఏకిన పార్టీ పెట్టాలని అనుకోవడం లేదు. గతంలో తాను జగన్‌కు సూచించిన స్ట్రాటజీని తాను ఫాలో అవుతున్నారు. ముందుగా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. బీహార్‌లో లాలూ, నితీష్ పని అయిపోయిందని.. వారు బీహార్‌కు చేసిందేమీ లేదని ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారన్నారన్నారు. బిహార్ అభివృద్ధి చెందాలంటే సరికొత్త ఆలోచనలు కావాలి. రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలనుకునేవారు నాతో కలిసి ముందుకురావాలని ఇతర పార్టీల నేతలకు పిలుపునిచ్చారు.
90 శాతం మంది ప్రజలు బిహార్‌లో మార్పు కోరుకుంటున్నారు. అందుకే పాదయాత్రలో వారిని కలుస్తానని ప్రకటించారు. రాజకీయ పార్టీ గురించి పాదాయత్ర తర్వాతే ప్రకటిస్తానన్నారు. మహాత్మ గాంధీ జయంతి పురస్కరించుకుని అక్టోబర్ 2న బిహార్ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. నేరుగా పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తే ఆదారణ లభించకపోతే.. మొదటికే మోసం వస్తుందన్న కారణంగా పీకే ముందు పాదయాత్ర చేసి అ తర్వాత పార్టీని ప్రకటించాలని అనుకుంటున్నట్లుగా భావిస్తున్నారు.
బీహార్‌లో పీకే రాజకీయానికి ఆకర్షితులయ్యే వారుఎంత మంది ఉంటారో తెలియదు కానీ.. ఆయనకు ఏదైనా పార్టీ లేదా గ్రూప్ మద్దతు లభించకపోతే… పాదయాత్ర సక్సెస్ కావడం కష్టమని భావిస్తున్నారు. అందుకే ఆయన పార్టీ ప్రకటన విషయంలో మరింత కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర స్ట్రాటజీని కూడా పీకేనే ఖరారు చేశారు.