గ్యాంగ్ రేప్‌లు, పేపర్ లీక్‌లు చేసిన వాళ్లంతా టీడీపీ వాళ్లేనని సీఎం జగన్ చెప్పి చేతులు దులుపుకునే ప్రయత్నం చేయడం ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది. సీఎం జగన్ తాను ముఖ్యమంత్రిని అనే విషయాన్ని మర్చిపోతున్నారని.. నేరస్తులు.. తప్పు చేసిన వాళ్లు ఎవరు అన్నది కాదు.. ముందు వాటిని కట్టడి చేయాల్సిన సమర్థత చూపాల్సిన బాధ్యత ఆయనకు ప్రజలు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎవరికీ నేరాలు చేసేందుకు లైసెన్స్ ఉండదు. టీడీపీ నేతలా.. వైసీపీ కార్యకర్తలా అన్నది చూడాల్సిన పని లేదు. ఎవర్నీ ఉపేక్షించకపోతేనే నేరాలు కట్టడి అవుతాయి.
ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు ప్రజల్లో భయాందోళనలు కల్పిస్తున్నాయి. నడి రోడ్ల మీద హత్యలు జరుగుతున్నాయి. శాంతి భద్రతల పరిస్థితిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్ తిరుపతిలో మాట్లాడుతున్న సమయంలోనే అనంతపురంలో ఓ అమ్మాయి గ్యాంగ్ రేప్‌కు గురై హత్యగావించబడ్డదని మీడియాలో వస్తోంది. కానీపోలీసులు మాత్రం ఆత్మహత్య కేసుగా నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు జగడం.. వాటిని సీఎం జగన్ రాజకీయం చేయడంతో అసలు నేరస్తులకు మద్దతుగా నిలుస్తున్న ఫీలింగ్ కలుగుతోంది. ఇది మరింత ప్రమాదకరంగా మారుతోంది.
ముఖ్యమంత్రి అయినా ప్రతీ దాన్ని రాజకీయం చేసుకుంటే ప్రజలకు ముప్పే వస్తుంది. ప్రస్తుతం ఏపీలో అదే జరుగుతోంది. పరిపాలన చేయాల్సిన చోట.. చేత కాక టీడీపీ వాళ్లు నారాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంత కంటే చేతకానికి తనం ఏముంటుందని ప్రతి ఒక్కరూ ఫీల్ అయ్యే పరిస్థితి తెచ్చి పెట్టుకున్నారు. టెన్త్ పేపర్లు లీక్ చేశారంటూ అరవై మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. కానీ చైతన్య, నారాయణ పేర్లను చెబుతున్నారు. నిజంగా వారి ప్రమేయం ఉంటే చర్యలు తీసుకోలేకపోవడం చేతకాని తనం కాదా ?
ఏపీ సీఎం వ్యవహారశైలి, మాటలు… అధికార బాధ్యతలపై ఏ మాత్రం అవగాహన లేనట్లుగా ఉన్నాయని… ఆయన స్పీచ్‌ను ఎవరైనా రాస్తున్నారా లేక సొంతంగా రాసుకుని చదువుతున్నారా అని వైసీపీ నేతలు కూడా డౌట్ పడుతున్నారు. ఇలాంటి ప్రసంగాల వల్ల జగన్ పై నెగెటివ్ ఇమేజ్ వస్తుందని బాధపడుతున్నారు. కానీ జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోతోంది.