తిరుపతి, విశాఖల తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నారు. శని, ఆదివారాల్లో ఈ జాబ్ మేళాను నాగార్జున యూనివర్శిటీలో ఏర్పాటు చేశారు.ఇప్పటికే నిరుద్యోగులు జాబ్ మేళా పేరుతో ఏర్పాటు చేసిన పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ జాబ్ మేళా ఏర్పాట్లలో బిజగా ఉన్న విజయసాయిరెడ్డి హఠాత్తుగా సజ్జల ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. వైసీపీలో రెండు పవర్ సెంటర్లుగా ఉన్న ఈ ఇద్దరికీ సరిపడదన్న ప్రచారం ఉంది. అయితే విజయసాయిరెడ్డి నేరుగా సజ్జలఇంటికి వెళ్లడంతో వీరి భేటీకి వైసీపీలోనూ ఆసక్తి ఏర్పడింది.
సజ్జలతో భేటీ తర్వాత జాబ్ మేళా ఏర్పాట్లను విజయసాయిరెడ్డి పరిశీలించారు. సజ్జలతో భేటీపై ేమీ మాట్లాడలేదు. సిఎం ఆదేశాల మేరకే జాబ్ మేళా చేపట్టామని.. తిరుపతి, వైజాగ్ జాబ్ మేళా ల్లో 30,473 మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని విజయసాయిరెడ్డి ప్రకటించారు. గుంటూరు జాబ్ మేళాలో 210 కంపెనీలు 26289 ఉద్యోగాలు ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు. 97000 మంది ఈ జాబ్ మేళా కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని… ఉద్యోగం రాని వారికి స్కిల్ డెలవప్ మెంట్ శిక్షణ ఇచ్చి మరోసారి జాబ్ మేళాలో పాల్గొనే అవకాశం ఇస్తామన్నారు. జాబ్ మేళా నిరంతర ప్రక్రియ..జాబ్ మేళాలు కొనసాగిస్తామని ప్రకటించారు.
జాబ్ మేళా నిర్వహణలో ఎలాంటి రాజకీయం ప్రయోజనం లేదని.. నిరుద్యోగుల కోసమే ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని విజయసాయి చెబుతున్నారు. రాజకీయ ప్రయోజనం కోసం మొక్కుబడిగా చేయడం లేదు… చిత్తశుద్ధితో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామమని తమపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఫార్మా, ఐటీ, బ్యాంకింగ్, కనస్ట్రక్షన్స్ కంపెనీలు ఉద్యోగాలిస్తున్నాయని.. జాబ్ మేళాలో ఉద్యోగం వచ్చిన వారికి స్థాయిని బట్టి 15 వేల నుంచి లక్ష రూపాయాల వరకు జీతం ఉంటుందని చెప్పుకొచ్చారు.
ఇప్పటి వరకూ నిర్వహించిన జాబ్ మేళాలో హెల్పర్లు, సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలను మాత్రమే ఆఫర్ చేశారన్న విమర్శలు వచ్చాయి. అదీకూడా నేరుగా ఎవరికీ ఆఫర్ లెటర్లు ఇవ్వలేదు. రెజ్యూమ్ తీసుకుని తర్వాత చెబుతామని పంపేసినట్లుగా చెబుతున్నారు. మరిగుంటూరు జాబ్ మేళా పరిస్థితి ఏమవుతుందో ?