ఎట్టకేలకు నయనతార పెళ్లి ఖాయమైంది. అతి త్వరలోనే నయన పెళ్లి కూతురు కాబోతోందన్నది ఫిల్మ్‌నగర్ టాక్. అందుకు వేదిక, ముహూర్తం కూడా ఫిక్సయిపోయినట్టు తెలుస్తోంది. జూన్ 9న నయన పెళ్లి తిరుపతిలో జరగబోతోందని, అందుకు ఏర్పాట్లు కూడా అయిపోయానని సమాచారం అందుతోంది.
విఘ్నేశ్ శివన్‌తో నయనతార చాలాకాలంగా ప్రేమలో ఉంది. ఇద్దరూ సహ జీవనం కూడా చేస్తున్నారు. ఎక్కడకి వెళ్లినా కలిసే వెళ్తున్నారు. ఇటీవల ఈ జంట గుళ్లూ, గోపురాలూ అంటూ ప్రదక్షిణాలు చేస్తోంది. ఈమధ్యే షిరిడీ వెళ్లొచ్చారు. తిరుపతిలోనూ జంటగా కనిపించారు. దాంతో.. వీరిద్దరి పెళ్లి టాపిక్ మళ్లీ బయటకు వచ్చింది. తాజాగా పెళ్లి డేట్ ఫిక్సయిపోయినట్టు కబురు అందుతోంది. తిరుపతిలో అతి తక్కువ సన్నిహితులు, స్నేహితుల మధ్య పెళ్లి చేసుకుని, చెన్నైలో గ్రాండ్‌గా రిసెప్షన్ ఇవ్వాలన్నది నయన ఆలోచన. అయితే ఈ విషయం నయన అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.