సర్కారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు ఓ ఆసక్తికరమైన సంగతి చెప్పారు. పరశురాం ఫ్లాఫ్ బ్యాక్ ని రిలీవ్ చేశారు. పరశురాంకి కథ ఓకే చెప్పిన తర్వాత ఇంటికి వెళ్లి నాకో మెసేజ్ పెట్టారు. ” ఒక్కడు సినిమా చూసి డైరెక్టర్ అవుదామని వచ్చాను. మీరు అవకాశం ఇచ్చారు. ఈ సినిమా ఎలా తీస్తానో చూడండి” అన్నారు. ఆయన చెప్పినట్లే అద్భుతంగా తీశారు. నా అభిమానులకు, నాన్న గారి అభిమానులకు పరశురాం ఒక అభిమాన దర్శకుడు అవుతారు. సర్కారు వారి పాటలో చాలా హైలెట్స్ వుంటాయి. హీరో హీరోయిన్ ట్రాక్ కోసం రిపీట్ ఆడియన్స్ వస్తారు. కీర్తి సురేష్ పాత్ర అద్భుతంగా వుంటుంది. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు” అన్నారు మహేష్..
ఇక తన స్పీచ్ చివర్లో కాస్త ఎమోషనల్ అయ్యారు మహేష్. ”ఈ రెండేళ్ళలో చాలా జరిగాయి మారాయి. నాకు బాగా దగ్గరైన వాళ్ళు దూరమయ్యారు. కానీ ఏది జరిగినా మీ అభిమానం మాత్రం మారలేదు. ఇది చాలు ధైర్యంగా ముందు సాగడానికి. మీ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడూ వుండాలని కోరుకుంటున్నాను. 12తేదిన మీ అందరికీ నచ్చే సినిమా సర్కారువారి పాట రాబోతుంది. మళ్ళీ మనందరికీ పండగే” అని అభిమానులని ఉద్దేశించి మాట్లాడారు మహేష్.