ప్రభుత్వంపై పోరాటానికి అందరూ కలిసి రావాలని అవసరమైతే త్యాగాలకు సిద్దమని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైసీపీ సహా అందరూ ఒకే రకంగా తీసుకున్నారు. జనసేన పార్టీతో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పుకున్నారు. కానీ సోము వీర్రాజు మాత్రం .. చంద్రబాబు తమనే పిలిచినట్లుగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఫీలవుతున్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కొందరు కలసి రమ్మంటున్నారని అవసరమైతే త్యాగాలకు సిద్ధమంటున్నారు.. ఆయన త్యాగాలు చాలా సార్లు చూశామని ఇకపై చూడటానికి సిద్ధంగా లేమని చెప్పుకొచ్చారు. 2024 లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
ఆయన మాటలు విని బీజేపీ నేతలు కూడా ముసిముసి నవ్వుకున్న నవ్వుకున్నారు. చంద్రబాబు పవన్ కల్యాణ్ ను కలిసి రావాలని గత ఎన్నికల ముందు నుంచి కోరుతున్నారు. కానీ బీజేపీని కూడా కలసి రావాలని ఆయన ఎప్పుడూ కోరుకోలేదు. అసలు బీజేపీని ఆయన పరిగణనలోకి తీసుకోవడం లేదు. కానీ బీజేపీ నేతలు ముఖ్యంగా సోము వీర్రాజు మాత్రం తెగ ఫీలైపోతున్నారు. తమనే పిలుస్తున్నారని అనుకుంటున్నారు. లేనిపోని ప్రకటనలు చేసిన కామెడీ అవువుతున్నారు.
జనసేన – టీడీపీ కలిస్తే ఎలా ఉంటుందన్న దానిపైనే ఇప్పుడు ఏపీలో చర్చలు జరుగుతున్నాయి. ఒక వేళ జనసేన టీడీపీతో కలిసినా బీజేపీని కలుపుకుంటారా లేదా అన్నదానిపై డౌట్స్ ఉన్నాయి. వారికి నాలుగైదు సీట్లు ఇచ్చినా వైసీపీ ఖాతాలో పడటం తప్ప.. మేలు ఏమీ ఉండదన్న అభిప్రాయం ఉంది. మరో వైపు టీడీపీతో పొత్తు ఉండాలని వైసీపీని వ్యతిరేకించే వర్గం బలంగా వాదిస్తోంది. మొత్తంగా సోము వీర్రాజు మాత్రం టీడీపీ ఏదో తమతో పొత్తు కావాలనుకుంటోందన్నట్లుగా మాట్లాడటం ప్రారంభించేశారు.