చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదు. అందరూ సోలో రిలీజ్ లే కోరుకుంటున్నారు. పోటీ ఉంటే.. తట్టుకోవడం కష్టమన్న సంగతి అర్థమైపోతోంది. ఓ మాదిరి సినిమాలైతే, కచ్చితంగా సోలో డేట్ కే వస్తున్నాయి. కానీ.. ఆగస్టు 11, 12న మాత్రం గంపగుత్తగా సినిమాలొస్తున్నాయి. ఎందుకంటే ఆగస్టు 15 సెలవు దినం. ఆరోజు క్యాష్ చేసుకుంటే.. వసూళ్లకు ఢోకా ఉండదు. అందుకే ఆగస్టు 11, 12 తేదీలు కీలకంగా మారాయి.
ఆగస్టు 11న బాలీవుడ్ సినిమా `లాల్ సింగ్ చద్దా` వస్తోంది. అమీర్ ఖాన్ సినిమా కాబట్టి.. అంచనాలు భారీగా ఉన్నాయి. దాంతో పాటుగా ఈ సినిమాలో నాగచైతన్య కీలక పాత్ర పోషించాడు. అందుకే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాపై ఓ లుక్ తప్పకుండా వేస్తారు. 12న యశోద వస్తోంది. సమంత కథానాయికగా నటించిన సినిమా ఇది. 11న చైతూ సినిమా.. 12న.. సమంత సినిమా వస్తున్నాయి కాబట్టి.. ఈ మాజీ భార్యాభర్తల సినిమాల్లో ఏది పై చేయిగా నిలుస్తుందన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు 12నే అఖిల్ ఏజెంట్ సినిమా రిలీజ్‌కి రెడీ అయ్యింది. అంటే ఇద్దరు అక్కినేని హీరోల మధ్య సమంత సినిమా విడుదల కాబోతోందన్నమాట. మరోవైపు నితిన్ సినిమా `మాచర్ల నియోజకవర్గం` కూడా ఆగస్టు 12నే వస్తోంది. జులై 8న రావాల్సిన సినిమా ఇది. ఇప్పుడు మనసు మార్చుకుని.. ఆగస్టు టార్గెట్ చేసింది. ఈ సినిమాలన్నింటి లక్ష్యం.. పంద్రాగస్టు సెలవను క్యాష్ చేసుకోవడమే.కాకపోతే.. ఒకేసారి ఇన్న ఇసినిమాలు గుంపుగా వచ్చేస్తున్నాయి. సమంతకు చైతూతోనే పోటీ అనుకుంటే… మరో రెండు సినిమాలు సమంత సినిమాని కార్నర్ చేస్తున్నాయి. మరి ఈ పోటీని సమంత ఎలా తట్టుకుంటుందో?