మరాఠీలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా `నటసామ్రాట్`. ఈ సినిమాని తెలుగులో `రంగమార్తాండ`గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కృష్ఱవంశీ దర్శకుడు. ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. ఈ సినిమాకి ఓటీటీ రూపంలో ఆకర్షణీయమైన ఆఫర్లు వస్తున్నారు. రూ.20 కోట్లకు డీల్ కుదుర్చుకోవడానికి ఓ ఓటీటీ సంస్థ నిర్మాతల్ని సంప్రదించినట్టు టాక్. ఈ డీల్ కుదిరితే.. నిర్మాత లాభాలతో బయటపడిపోతాడు.
కృష్ణవంశీ సినిమాలంటే.. కమర్షియల్ వాల్యూస్ గురించి పెద్దగా ఆరా ఉండదు. రంగమార్తండ కథని ప్రయోగాత్మక చిత్రంగానే చూడాలి. థియేటర్లలో.. ఈ సినిమాని చూస్తారో లేదో అనే డౌట్ ఉంటే.. కచ్చితంగా ఓటీటీకి ఇది మంచి బేరమే అనుకోవాలి. ఈ సినిమాపై పాజిటీవ్ బజ్ ఏర్పడింది. కొంతమంది సన్నిహితులకు ఈ సినిమా రషెష్ చూపించేశారు కృష్ఱవంశీ. వాళ్లంతా.. `కృష్ణవంశీ ఈజ్ బ్యాక్` అంటున్నారు. ముఖ్యంగా బ్రహ్మానందం పాత్ర ప్రేక్షకలోకాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుందని ముందే కితాబులు ఇస్తున్నారు. దానికి తోడు ఇళయరాజా సంగీతం ఉండనే ఉంది. ఇవన్నీ… ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దాంతో.. ఓటీటీల దృష్టి రంగమార్తండపై పడింది. ఒక్క పోస్టరూ, టీజరూ, పాట కూడా బయటకు రాకుండా.. కృష్ణవంశీ సినిమాకి ఈ తరహా బజ్ రావడం ఇదే మొదటిసారేమో..? మరి ఈ ఏ ఓటీటీ ఖాతాలోకి వెళ్తుందో?