మాజీ మంత్రి నారాయణను ఎలాగైనా జైల్లో పెట్టాలని తలా తోకా లేని కేసులు పెట్టి… ఎలాంటి ఆదారాల్లేకపోయినా ..ఆయన కుమారుడి వర్ధంతి రోజే అరెస్ట్ చేసిన పోలీసులకు న్యాయమూర్తి షాకిచ్చారు. కావాలని ఉద్దేశపూర్వకంగా ఆగి.. ఆగి తెల్లవారుజామున న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి అభియోగాలు నమ్మదగ్గవిగా లేవని తేల్చారు.
అదే సమయంలో నారాయణ తరపు న్యాయవాదులు ఆయన కాలేజీ వ్యవస్థాపకుడేనని చైర్మన్‌గా లేరని. .. ఎప్పుడో ఎనిమిదేళ్ల కిందటే చైర్మన్ పదవి నుంచి వైదొలిగారని ఆధారాలను న్యాయమూర్తికి ఇచ్చారు. దీంతో రూ. రెండు లక్షల పూచీకకత్తుతో వ్యక్తిగత బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. నారాయణను అరెస్ట్ చేసినప్పటి నుండి చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి దగ్గర్నుంచి వైసీపీ మంత్రుల వరకూ అందరూ వచ్చి కేసులపై తీర్పులు చెప్పేశారు. నారాయణపై ఆధారాలున్నాయన్నారు.
కస్టడీలో ఉన్న ఓ నిందితుడితో నారాయణ పేరు చెప్పించి.. స్టేట్మెంట్ రికార్డు చేయించి.. అరెస్ట్‌కు భారీ కుట్ర చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే నారాయణను సోమవారమే నమోదు చేసిన రాజధాని అలైన్ మెంట్ కేసులో మరోసారి అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న అనుమానాలు టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.