రామ్ మార్కెట్ నిన్నా మొన్నటి వరకూ 20 – 25 కోట్ల లోపే. ఇస్మార్ట్ శంకర్ రూ.50 కోట్లు వసూలు చేయడంతో… రామ్ పై నమ్మకాలు పెరిగిపోయాయి. కానీ ఎంత పెరిగినా, బడ్జెట్ రూ.50 కోట్లకు కాస్త అటూ ఇటూ ఉండేలా చూసుకోవాలి. కానీ.. రామ్ కొత్త సినిమా బడ్జెట్ బోర్డర్లు దాటేసింది.
రామ్ – లింగుస్వామి కాంబినేషన్‌లో `ది వారియర్` రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఇప్పటి వరకూ 70 కోట్ల బడ్జెట్ అయ్యిందట. ఇంకొంచెం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మిగిలివుంది. పబ్లిసిటీ కూడా కలుపుకుంటే మరో 5 కోట్లు తేలుతుంది. అంటే రూ.75 కోట్లన్నమాట. రామ్ కెరీర్‌లో పెద్ద బడ్జెట్ సినిమా ఇదే. అంత వరకూ ఓకే. కానీ రాబట్టుకోవడం ఎలా? థియేటరికల్ రైట్స్ రూపంలో రామ్ సినిమాకి 35 కోట్లు వస్తే గొప్పే. శాటిలైట్, డిజిటల్ మరో 20 కోట్లు వేసుకున్నా.. 55 దగ్గర ఆగిపోతుంది. కాకపోతే.. తమిళంలో కూడా ఈ సినిమాని స్ట్రయిట్ గా విడుదల చేస్తున్నారు. అక్కడ మార్కెట్ రామ్ కి ఎంత ప్లస్ అవుతుంది? అన్నదానిపై రికవరీ ఆధారపడి ఉంటుంది. మరో విశేషం ఏమిటంటే.. రామ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా పట్టాలెక్కనుంది. ఆ సినిమా బడ్జెట్ రూ.100 కోట్లని టాక్.