ఎన్టీఆర్ న‌ట‌న‌కు క‌ళాత‌ప‌స్వి ఫిదా

కె.విశ్వ‌నాథ్ వ‌యోభారంతో ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు. బ‌య‌ట ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. సినిమా ప‌రిశ్ర‌మ‌కు దూర‌మ‌య్యారే త‌ప్ప‌.. సినిమాల‌కు కాదు. ఆయ‌న కాల‌క్షేపం సినిమాలు చూడ‌డ‌మే. ఈమ‌ధ్య ఆయ‌న `ఆర్‌.ఆర్‌.ఆర్‌` చూశార్ట‌. అందులోని ఎన్టీఆర్ న‌ట‌న‌కు ఫిదా అయిపోయార‌ట‌. ముఖ్యంగా `కొమ‌రం భీముడా` పాట విశ్వనాథ్ కి తెగ న‌చ్చేసింద‌ని, ఈ పాట చూసి ఆయ‌న కూడా ఎమోష‌న్ అయిపోయార‌ని తెలుస్తోంది. ఈ విష‌యాన్ని వెంట‌నే ఎన్టీఆర్‌కి ఫోన్ చేసి మ‌రీ చెప్పార్ట‌. కె.విశ్వ‌నాథ్ ద‌గ్గ‌ర్నుంచి అభినంద‌న రావ‌డం ఓ అవార్డుతో స‌మానం. ఎన్టీఆర్‌కి కూడా విశ్వ‌నాథ్ సినిమాలంటే చాలా ఇష్టం. `నాకు సాగ‌ర సంగ‌మం లాంటి సినిమా చేయాల‌ని ఉంది.. దాన్ని విశ్వ‌నాథ్ గారు మాత్ర‌మే తీయ‌గ‌ల‌రు..` అని ఎన్టీఆర్ వ‌చ్చిన కొత్త‌లో చెప్పేవాడు. ఇప్పుడు ఈ క‌ల‌యిక‌కు అవ‌కాశం లేదు.కాక‌పోతే.. విశ్వ‌నాథ్ దృష్టిలో మాత్రం ఎన్టీఆర్ ప‌డ్డాడు. అది చాలు. `ఆర్‌.ఆర్‌.ఆర్‌`లో చ‌ర‌ణ్‌తో పోలిస్తే ఎన్టీఆర్ పాత్ర నిడివి, దాని ప్రాధాన్యం త‌గ్గింద‌ని బాధ ప‌డుతున్న ఎన్టీఆర్ అభిమానుల‌కు ఇలాంటి ప్ర‌శంస‌లు ఊర‌ట క‌లిగిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close