తెలంగాణ సీఎం కేసీఆర్ కొద్ది రోజులుగా బయటకు రావడం లేదు. పూర్తిగా ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు. పీకే వచ్చి కలిసి వెళ్లక ముందు నుంచి ఆయన ఫాంహౌస్‌లోనే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. మధ్యలో ఓ సారి ఢిల్లీ టూర్ ఖరారు చేసుకున్నారు. ఈ సారి రెండు వారాల పాటు ఉంటారని టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. కానీ ఢిల్లీటూర్‌కు కూడా వెళ్లలేదు. జాతీయ పార్టీ పెట్టాలన్న ఉద్దేశంతో ఉన్న ఆయన ఆ పనుల్లో బిజీగా ఉన్నారని టీఆర్ఎస్ క్యాడర్ భావిస్తోంది.
రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఆయన ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ కు ఉన్న ఓట్లు కీలకమే. బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిస్తే కాంగ్రెస్‌కు పరోక్షంగా మద్దతు తెలిపినట్లే అవుతుంది. బీజేపీ ప్రకటించే అభ్యర్థికి మద్దతు తెలిపితే ఇంత కాలం చేసిన పోరాటం వృధా అవుతుంది. దీంతో ప్రాంతీయ పార్టీల తరపున ఓ అభ్యర్థిని ప్రకటించాలని.. కేసీఆర్ ప్రయత్నంగా చెబుతున్నారు.
ప్రస్తుతం బీజేపీ పూర్తి స్థాయిలో టార్గెట్ చేయడంతో .. కేసీఆర్ సవాళ్లు ఎదుర్కొంటున్నారు. అప్పులు ఇవ్వకపోవడం వల్ల జీతాలు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థుల్లో కేసీఆర్ .. ఏ కార్యచరణతో ముందుకు వెళ్తారన్నది’ పార్టీ నేతల్లో చర్చనీయాంశమైంది. ఏ వ్యూహంతో ముందుకెళ్తారన్నది పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. కేసీఆర్ దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అంత తేలికగా కేసీఆర్ ప్లాన్ మార్చుకోరని ముందుకే వెళ్తారని భావిస్తున్నారు.