ఆర్టీసీలో అద్దె బస్సుల ప్రకటన వస్తే.. పలువురు పోటీపడి టెండర్లు వేసేవారు. రాజకీయ నేతలు జోక్యం చేసుకుని .. వారి ద్వారా తమ బస్సులను ఆర్టీకి అద్దెకు ఇచ్చేవారు. కార్మికులేమో.. అద్దె బస్సులు వద్ద సొంత బస్సులు కొనండని ఉద్యమాలు చేస్తారు. అనూహ్యంగా ఇప్పుడు ఏపీలో అద్దె బస్సులకు టెండర్లు పిలిచినా ఎవరూ రావడం లేదు. ఉనన బస్సులు పాతవి కావడం.. కొత్త బస్సులు కొనలేమి చేతులెత్తేయడంతో అద్దె బస్సులు తీసుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు టెండర్లు పిలిచింది. కానీ అసలు ఆ టెండర్లకు స్పందన కరవయింది.
గతంలో ఉన్న పరిస్థితిని చూసి.. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున టెండర్లు వస్తాయని బస్సులు పెట్టుకోవచ్చని అనుకున్న ఆర్టీసీకి ఎవరూ స్పందించకపోవడంతోషాక్ తగిలినట్లయింది. 900 అద్దె బస్సులకు ప్రకటన ఇస్తే కేవలం 130 బస్సులు పెడతామని కొంత మంది కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. చివరికి వారు కూడా ఉంటారో ఉండరో తెలియని పరిస్థితి. ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందని ఎవరికీ నమ్మకం లేకపోవడమే ఇలాంటి పరిస్థితికారణం అని భావిస్తున్నారు. గతంలో రాజకీయ సిఫార్సులతో బస్సులు పెట్టిన వారు ఇప్పుడుత తమ చేతిలో అధికారం ఉన్న బస్సులు పెట్టేందుకు ముందుకు రావడం లేదు.
ప్రభుత్వం విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోతోందనడానికి ఇదే నిదర్శనమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బిల్లులు సకాలంలో వస్తేనే ఎవరైనా ఏదైనా పని లేదా సేవ చేయడానికి వస్తారు. కానీ అంతా అయిపోయిన తర్వాత అవినీతి ముద్ర వేసి అయినా సరే బిల్లులు ఎగ్గొట్టే కుట్రలకు పాల్పడే ప్రభుత్వం ఉండటంతో ఎందుకైనా మంచిదని దూరం పాటిస్తున్నట్లుగా తెలుస్తోంది.