గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ కత్తెర క్రిస్టీనా భర్త కత్తెర సురేష్ పై దత్తర పేరుతో పిల్లలను విదేశాలకు అక్రమంగా తరలించడం.. విదేశాల నుంచి నిబంధలకు విరుద్ధంగా విరాళాలు సేకరించడం వంటి నేరాలపై సిబిఐ కేసు నమోదు చేసింది. హర్వెస్ట్ ఇండియా సొసైటీ అధ్యక్షుడు గా కత్తెర సురేష్ ఉన్నారు. ఈ సంస్థ ఎఫ్సీఆర్ఏ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ నిధులు పొందడం పై సిబిఐ కేసు నమోదు చేసింది. విదేశీ నిధుల స్వీకరణల విషయంలో నిబంధనలు ఉల్లంగిస్తున్న అనేక మత మార్పిడి సంస్థలపై కేంద్రం కొరడా ఝళిపించింది. బుధవారం దేశవ్యాప్తంగా 40 చోట్ల సీబీఐ సోదాలు జరిపింది. విదేశీ విరాళాల స్వీకరణలో నిబంధనలు ఉల్లంఘించిన స్వచ్ఛంద సంస్థల నుంచి ముడుపులందుకున్న ఐదుగురు ప్రభుత్వ అధికారులతోపాటు 10 మందిని అరెస్ట్ చేసింది.
విదేశీ నిధుల స్వీకరణలో విదేశీ నిధుల నియంత్రణ చట్టం ఉల్లంఘించిన వారికి క్లియరెన్స్ ఇవ్వడానికి కొందరు అధికారులు ముడుపులు స్వీకరించారని సీబీఐ ప్రకటించారు. కత్తెర సురేష్ నడుపుతున్న సంస్థ కూడా ఇలా నిబంధనలకు విరుద్ధంగా పండ్స్ విదేశీల నుంచి తీసుకు వచ్చింది. అదే సమయంలో ఈ సంస్థ భారతీయ అనాథలైన చిన్నపిల్లల్ని అక్రమంగా విదేశాలకు తరలించిన అభియోగాలు కూడా ఎదుర్కొంటున్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ కు బాలల హక్కుల జాతీయ కమిషన్ నోటీసులు జారీ చేసింది.
అక్రమంగా మైనర్ లను దత్తత తీసుకోవడం , అక్రమంగా విదేశాలకు తరలింపు పై జాతీయ కమిషన్ లో కేసు నమోద అయింది. కత్తెర సురేష్ దంపతులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే కత్తెర సురేష్, క్రిస్టినా దంపతులు ఏపీ అధికార పార్టీ పెద్దలకు అత్యంత సన్నిహితులు. గతంలో మత మార్పిళ్లపై చర్యలు తీసుకోవాలని.. సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ కూడా మత మార్పిళ్ల సంస్థను నడుపుతున్నారని చర్యలు తీసుకోవాలని ఆదేశించినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. .