సీఎం జగన్ దావోస్ పర్యటనకు వెళ్లిన వెంటనే పెట్టుబడులు రావని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. జగన్ ఈ నెల 22 నుంచి దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఓ బ్రోచర్‌ను మంత్రి అమర్నాథ్ విడుదల చేశారు.
ఎన్ని కోట్ల పెట్టుబడులు వస్తాయి అనే అనుమానాలు చాలా మంది లో ఉంటాయని.. ఎకనామిక్ ఫోరమ్ అనేది పెద్ద కంపెనీలు పారిశ్రామిక ప్రగతి పై చర్చించే వేదిక అని సహజంగానే ఏపీ పారిశ్రామిక స్థితి గతులు పై చర్చ జరుగుతుందన్నారు.
22 నుంచి 26 వరకు జరిగే దావోస్ పర్యటనతోనే పెట్టుబడులు రావన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక టీం తో ముందుకు వెళ్లి ఏపీ కి రావాల్సిన పెట్టుబడులు పైచర్చిస్తామమని.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ చైర్మన్ తో కూడా సీఎం జగన్ చర్చిస్తారని అమర్నాథ్ ప్రకటించారు. 22వ తేదీన దావోస్ వెళ్లే సీఎం జగన్ అక్కడ 23వ తేదీన వైద్యరంగంపై కీలక సమావేశంలో పాల్గొంటారు. 24వ తేదీన విద్య, నైపుణ్య రంగాలపై అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. డీసెంట్రలైజ్డ్ ఎకానమీ దిశగా మార్పుపై సమావేశం జరుగుతుందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ఎంపీ మిథున్ రెడ్డి , పరిశ్రమల మంత్రిగా అమర్నాథ్ తో పాటు ్ధికారులు పాల్గొన్నారు.
దావోస్‌లో కోవిడ్ తర్వాత కాలంలో పారిశ్రామిక మార్పులు పై చర్చ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడుప్రతీ ఏడాది సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దావోస్ వెళ్లేవారు. పెట్టుబడులుపెట్టాడనికి పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించేవారు. అనేక పరిచయాలో పెద్ద పెద్ద కంపెనీలు ఏపీకి వచ్చాయి. అయితే ఈ టూర్లన్నీ డబ్బు ఖర్చు వృధా అని వైసీపీ నేతలు ఆరోపించేవారు. ఇప్పుడు జగన్ కూడా పెద్ద బృందంతో దావోస్ వెళ్తున్నారు.