మహేష్ బాబు కొత్త సినిమా సర్కారు వారి పాట మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటి వరకూ మహేష్ సినిమాల టాక్ అయినా ఏదయినా.. ఇతర సినీ హీరోల అభిమానుల నుంచే వచ్చేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఈ సినిమాలో నేను ఉన్నాను..నేను విన్నాను అనే డైలాగ్ పెట్టడంతో పాటు వైసీపీ అధినేత జగన్ ను మహేష్ పొగడటంతో టీడీపీ ఫ్యాన్స్ హర్టయ్యారు ముందు నుంచే నెగెటివ్ టాక్ చెప్పడం ప్రారంభించారు. సినిమాకు మిక్సుడ్ టాక్ రావడంతో వారు విజృంభిస్తున్నారు. అనూహ్యంగా వైసీపీకి మద్దతున్న కొన్ని సినీ వెబ్ సైట్లలో కూడా నెగెటివ్ రివ్యూలే రాశారు.
టీడీపీ ఫ్యాన్స్ నెగెటివ్ టాక్ చెబుతూండటంతో పోటీగా వైసీపీ నేతలు కూడా హిట్ టాక్ చెప్పడం ప్రారంభించారు. సినిమా చూశారో లేదో కానీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ట్విట్టర్ రివ్యూ రాసేశఆరు. సినిమా బాగుందన్నారు. పనిలో పనిగా డైలాగ్‌ను కూడా గుర్తు చేసుకున్నారు. ఈ ఒక్క డైలాగ్ సినిమాలో ఎంత వరకూ అవసరమో కానీ.. ఈ సినిమాను రాజకీయాల్లోకి మాత్రం లాగేసింది. దీంతో ఓ రాజకీయ వర్గం పూర్తిగా దూరమైపోయింది. వారు సినిమాచూసినా నెగెటివ్ టాక్ స్ప్పెడ్ చేస్తున్నారు.
సినిమా బాగుందనే టాక్ కూడా రాకపోవడంతో ఇప్పటికి వారిదే జోరు కనిపిస్తోంది. అనవసరంగా రాజకీయాలతో కెలుక్కోవడం వల్ల మహేష్‌కు లేనిపోని సమస్యలు వచ్చాయంటున్నారు. మరోవైపు బాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలతో అక్కడా నెగెటివ్ ట్రెండ్ నడుస్తోంది. మహేష్ పెద్దగా మాట్లాడరు. మాట్లాడితే ఇలాంటి వివాదాలు వస్తున్నాయి. కొసమెరుపేమిటంటే.. టిక్కెట్ల ఇష్యూలో జగన్ ను కలిసిన ముగ్గురు హీరోలు ప్రభాస్, చిరంజీవి, మహేష్ సినిమాలు కొట్టుకుపోయాయని.. ఆయనది ఐరన్ లెగ్గని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు.