గడప గడపకూ వెసీపీ కార్యకర్తల ఇళ్లకే అయినా నిరసనలు ఎదురు కావడం.. అవి మీడియాలో విస్తృత ప్రచారం కావడంతో కవర్ చేసేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పట్లాగే మీడియా ముందుకు వచ్చారు. నిరసనలు చేస్తున్న వారికి పథకాలు అందని మాట నిజమే కానీ వారెవరూ అర్హులు కాదని తేల్చారు. అర్హత లేని వాళ్లు కూడా పథకాలు కావాలని డిమాండ్ చేస్తున్నారని సజ్జల చెబుతున్నారు. నిరుపేదలకు కూడా సాధించలేనంత అర్హతా ప్రమాణాలు నిర్దేశించామని ఆయన అనుకోవడం లేదు.
తొలి రోజు నిరసనలు షాకివ్వడంతో రెండో రోజు నుంచి స్ట్రిక్ట్‌గా వైసీపీ కార్యకర్తలు.. పథకాల ద్వారా లబ్ది పొందిన వారి ఇళ్లకే వెళ్లాలని.. వీడియోలు తీసివైరల్ చేయాలని సూచనలు చేశారు. ఈ అంశంపైనా సజ్జల క్లారిటీ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తల ఇళ్లకు కూడా వెళ్లమంటున్నామని.. వారి ఆశీస్సులు కూడా ఎమ్మెల్యేలకు కావాలని ఆయన అంటున్నారు. అయితే గడపగడపకూ జరుగుతున్న కార్యక్రమంలో మాత్రం కనిపిచడం లేదు. తొలి రోజు గడపగడపకూ వెళ్లిన సగం మంది ఎమ్మెల్యేలు రెండో రోజు కనిపించలేదు.
ద్వితీయ శ్రేణి నేతలో మ మ అనిపిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంత కాలం నిర్వహించాలో కూడా స్పష్టత లేదు. రెండేళ్ల ముందు ఇంటింటికి తిరగడం వల్ల ప్రయోజనం ఉండదని.. రాను రాను అన్ని పథకాల్లో లబ్దిదారులను తగ్గిస్తూంటే వారంతా వ్యతిరేకులుగా మారుతున్నారని వైసీపీ క్యాడర్ ఆందోళన చెందుతోంది.