ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ ఫామ్ లోకి వచ్చేశాడు రామ్ పోతినేని. ఇప్పుడు `ది వారియర్`గా ముస్తాబవుతున్నాడు. లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఆ తరవాత బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేస్తాడు రామ్. ఇప్పుడు హరీష్ శంకర్‌తో కూడా ఓ ప్రాజెక్టు ఓకే అయ్యిందని టాక్.
మాస్, కర్షియల్ కథకుల కేరాఫ్ అడ్రస్స్ హరీష్ శంకర్. రామ్ కి అలాంటి కథలు బాగా సూటవుతాయి. రామ్ కి సరిపడ కథ.. హరీష్ సెట్ చేసినట్టు టాక్. ఈ కథకు గురించి ఇద్దరి మధ్యా చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది. అయితే.. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి టైమ్ పడుతుంది. బోయపాటి శ్రీనుతో రామ్ ఓ సినిమా పూర్తి చేయాలి. మరోవైపు హరీష్ శంకర్ కూడా పవన్ తో సినిమా ఫినిష్ చేయాలి. ఇవి రెండూ అయ్యాకే ఈ కాంబో ఉండొచ్చు. ఇది గనుక సెట్ అయితే … మాస్‌ని బాగా మెస్మరైజ్ చేసే కొత్త కాంబో అవ్వడం ఖాయం.