హిట్లతో, ఫామ్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసేస్తున్నాడు రవితేజ. తన రామారావు ఆన్ డ్యూటీ విడుదలకు రెడీగా ఉంది. ధమాకా సెట్స్‌పై ఉంది. టైగర్ నాగేశ్వరరావు ఇటీవలే క్లాప్ కొట్టారు. రావణాసుర అనే సినిమాని కూడా ఒప్పుకున్నాడు రవితేజ. ఇప్పుడు మరో కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. ఈసారి ఓ తమిళ దర్శకుడికి రవితేజ అవకాశం ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. తనే.. బాలాజీ మోహన్. `మారి 1,`మారి 2` సినిమాలతో హిట్లు కొట్టాడు బాలాజీ. తెలుగులో `లవ్ ఫెయిల్యూర్` అనే ఓ సినిమా తీశాడు. అది కూడా బాగానే ఆడింది. ఇప్పుడు రవితేజకు ఓ కథ చెప్పాడు. అది రవితేజకు బాగా నచ్చింది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. బాలీవుడ్ కి చెందిన ఓ అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు టాక్. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.