”కామెడీ సినిమాలు తగ్గిపోవడం ఒక కమెడియన్ గా నా కంటే ప్రేక్షకుల మీద ఆ ప్రభావం ఎక్కువ వుంటుంది” అన్నారు సునీల్. ఎఫ్ 3 ప్రమోషన్స్ లో మాట్లాడారు. కామెడీ సినిమాలు ఎక్కువగా రావాలని కోరుకున్నారు. ” నవ్వించే సినిమాలు చేయడం అంత తేలిక కాదు. నవ్వించడం కూడా అంత తేలిక కాదు. సరదాగా నవ్వుకొని వుంటే ఇమ్యునిటీ పెరుగుతుందని డాక్టర్లు కూడా చెప్తున్నారు కదా.. సో.. కామెడీ సినిమాలు ఎక్కువ రావాలి. ప్రేక్షకులని నవ్వించాలి. సీరియస్ పాత్రలతో పోల్చుకుంటే కామెడీ చేయడమే కష్టం. సినిమా అనేది అల్టిమెట్ గా వినోదం. కష్టపడి పని చేసిన తర్వాత మనిషి రిలాక్స్ అవ్వాలి. అలా రిలాక్స్ అవ్వాలంటే కామెడీ సినిమాలే ఎక్కువ రావాలి. ప్రతి రోగానికి మందు నవ్వు. నేను అదే నమ్ముతా. అన్ని జోనర్ సినిమాలూ రావాలి. కానీ కామెడీ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటాను” చెప్పుకొచ్చారు సునీల్.