ట్విట్టర్లో టీడీపీ, వైసీపీ నేతలు బూతులు తిట్టుకుంటున్నారు. ఎవరికి వారు భాషా ప్రయోగాలు చేస్తూ ఎదుటి వారి క్యారెక్టర్లపై నిందలేస్తున్నారు. నువ్ ఒకటంటే నేను నాలుగు అనలేనా అంటూ చెలరేగిపోతున్నారు. అంబంటి రాంబాబు ఓ మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించాడని.. ఆ ఆధారాలన్నీ సీఎం జగన్ కు చేరాయని.. త్వరలో ఆయనను బర్తరఫ్ చేస్తారని అయ్యన్నపాత్రుడు పెట్టిన ట్వీట్‌తో రచ్చ ప్రారంభమయింది.దానికి కౌంటర్‌గా అంబటి రాంబాబు లోకేష్ పైన.. చంద్రబాబుపైనా బూతులు లంకించుకున్నారు.
అయ్యన్న తనపై విమర్శలు చేస్తే కౌంటర్ ఇవ్వకుండా చంద్రబాబు, లోకేష్‌లపై ఆరోపణలు చేయడంతో సీన్ మారిపోయింది. లోకేష్ కాలేజీలో చదువుకుంటున్న సమయంలో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నవి గతంలో వైసీపీ నేతలు చాలా సార్లు వైరల్ చేసిన ఫోటోలను అంబటి రాంబాబు పోస్ట్ చేశారు. దీంతో ఫేస్ కనబడకుండా ఓ ఫోటోను అయ్యన్నపాత్రుడు ఓ అమ్మాయి ఫోటో పోస్ట్ చేశారు. మాకు సంస్కారం ఉంది కాబట్టి ఫేస్ కనిపించనీయలేదన్నారు. ఆ ఫోటో అంబటి రాంబాబు కుమార్తెదిగా నెటిజన్లు ఎలాంటి ఎడిట్ లేకుండా పోస్టులు ప్రారంభించారు. ముందు మద్యం బాటిల్‌తో విదేశాల్లో హాఫ్ షర్ట్‌తో ఉన్న ఆమె ఫోటోను ప్రదర్శించారు. దీంతో కుటుంబసభ్యులను కూడా ఈ రొంపిలోకి దింపినట్లయింది.
అంబటి రాంబాబు అంతటితో ఆగకుండా తన భాషా ప్రయోగాన్ని కొనసాగించారు. దీంతో ఈ సారి అయ్యన్న పాత్రుడు నేరుగా అంబటి రాంబాబు రాసలీలల ఆడియో టేప్ టు అని రిలీజ్ చేశారు. ఇంకా చాలా వస్తాయని చెబుతున్నారు. త్వరలో సీఎంను కలిసి జర్నలిస్టు ఫిర్యాదు చేస్తారని.. బర్తరఫ్ చేస్తారో.. అన్నీ తెలిసే పదవి ఇచ్చాం కాబట్టి ఊరుకుంటారో మీ ఇష్టమని తేల్చేశారు. మొత్తంగా అదేదో సామెత చెప్పుకున్నట్లుగా వీరిద్దరూ ట్విట్టర్ పోరాటంలో కొన్ని ఆడియోలు.. వీడియోలు .. ఫోటోలు బయటకు రావడం కలకలం రేపుతోంది.