తెలంగాణలో టీఆర్ఎస్ పనైపోయిందని ఎవరు చాన్స్ అందుకుంటే వారికే అవకాశం అని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పోటీ పడి రాజకీయ కార్యకలాపాలను పెంచుతున్నాయి. అగ్రనేతలతో బహిరంగసభలు పెట్టి ప్రజల్లోకి వెళ్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. వారికి కేటీఆర్ సహా మంత్రులు కౌంటర్లు ఇస్తున్నారు . అయితే కేసీఆర్ మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. ఆయన స్పందించకపోవడంతో మిగతా వారి విమర్శలకు పెద్దగా విలువ లేకుండా పోతోంది. కేసీఆర్ మాట్లాడకపోవడానికి కారణం ఏమిటన్న చర్చ నడుస్తోంది.
రాహుల్ గాంధీ టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు రాజుగా మారారని. .ప్రజల్ని పీడించుకుతింటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్ .. ఆ వర్గాల్ని ఆకట్టుకునేలా ఉంది. మరో వైపు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ చేసిన యాత్ర ముగింపు సభకు అమిత్ షా.. దమ్ముంటే ఎన్నికలకు వెళ్దాం రా అని సవాల్ చేశారు., ఇది జరిగి రెండు రోజులు అవుతున్నా కేసీఆర్ స్పందించలేదు. కేసీఆర్ మౌనం ఇప్పుడు తెలంగాణ రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. కేసీఆర్ స్పందించాలని టీఆర్ఎస్ క్యాడర్ కూడా కోరుకుంటోంది.
అయితే ఇలా పూర్తి స్థాయిలో మౌనం పాటించి.. చివరన వచ్చి సిక్సర్ కొట్టడం కేసీఆర్ స్టైల్. అయితే గతంలో ఆయన బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను రోజువారీ ప్రెస్ మీట్లు పెట్టి వివరిస్తానని ప్రకటించారు. అనకున్నట్లుగానే ఒకటి , రెండు రోజులు పెట్టారు. తర్వాత సైలెంటయ్యారు. ఇప్పుడు అగ్రనేతలు వచ్చి విమర్శలు చేస్తున్న పట్టించుకోవడం లేదని.. విమర్శలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ తదుపరి కార్యాచరణ ఏమిటో టీఆర్ఎస్ వర్గాలకూ అంతుచిక్కడం లేదు.