ఏపీలో వాలంటీర్ల గురించి వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు కూడా గొప్పగా చెబుతూంటారు.తమ కంటే పవర్ ఫుల్ అని. పథకాలు జగన్ ఇస్తున్నారని కాదని వాలంటీర్లు ఇస్తున్నారని ప్రజలు అనుకునేపరిస్థితి. అలాంటి వారి పవర్‌ను మరోసారి చూపించారు. అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలం లో అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రజల్ని పీడిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో 23 మంది వాలంటీర్లను ఎంపీడీవో విధుల నుంచి తొలగించారు. ఈ వార్త హైలెట్ అయింది. ఎంత వేగంగా ఆదేశాలిచ్చారో అంతే వేగంగా సస్పెండ్ చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఎంపీడివో ఆదేశాలు జారీ చేసేశారు.
ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తూండటంతో ఏంపీడివో రమేష్ బాబు వాలంటీర్ల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసి..23 మంది వాలంటీర్లను విధులు నుండి తొలగిస్తూ, ఏడు మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు ఇస్తూ ఈ నెల 13వ తారీఖున ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 14వ తారీఖున వాలంటీర్లను తొలగించనట్లు వస్తున్న వదంతులు నమ్మవద్దంటూ ఎంపిడివో రమేష్ బాబు స్వయంగా సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 15వ తారీఖున సస్పెండ్ చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకు తీసుకొవాలని ఆయా 15 గ్రామాల సర్పంచ్ లు,కోరినట్లు, వారికి మరోక సారి అవకాశణమ కల్పిస్తూ తిరిగి విధుల్లోకి తీసుకొంటున్నట్లు రమేష్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు.
ఒత్తిడి తట్టుకోలేక పోయాడో ఏమోగానీ ఈనెల 16వ తారీఖున జారీ చేయాల్సిన ఉత్తర్వులు, ఒక్క రోజు ముందుగానే అంటే ఈ నెల15వ తేదీ ఆదివారం రోజునే ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీడీవో క్షమాపణలు చెబుతున్నట్లుగా వీడియో రిలీజ్ చేయడం.. ఆదేశాలను కూడా ఆదివారం విడుదల చేయడంతో వాలంటీర్లు .. తమ పవర్ ఏంటో తెలుసా అన్నట్లుగా వ్యవహరించడం ప్రారంభించారు.. ఇతరులు కూడా ప్రారంభిస్తారు. మరి వాలంటీర్లతో పెట్టుకుంటే అట్లుంటది మరి !