అనిల్ రావిపూడి ఎఫ్ 3 తో సందడి చేయబోతున్నారు వెంకటేష్. ఈ సినిమా విడుదలకు ముందే ఒక హిందీ చిత్రానికి సంతకం చేశారు వెంకీ. సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం ‘కభీ ఈద్ కభీ దీపావళి’. ఈ సినిమాలో వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. ఇందులో పూజా, వెంకీకి చెల్లి పాత్రలలో కనిపించబోతున్నారని తెలిసింది.
వెంకటేష్, పూజా ఈ సినిమాలో నటించడంతో తెలుగుకూడా ఆసక్తి పెరిగింది. ముంబయిలోని విలేపార్లేలో ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. కభీ ఈద్ కభీ దీపావళి చిత్రానికి ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే వెంకీ ఈ సినిమా షూటింగ్ లో పాల్గోబోతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 30 న ఈ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.