ఏడిద నాగేశ్వరరావుగారు, పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ లో అన్నీ ఆణిముత్యాలాంటి సినిమాలు వచ్చాయి. అయితే కొన్ని సినిమాలు బాక్సాఫీసు దగ్గర అంతగా రాణించలేదు. ఆ లిస్టు లో చిరంజీవి ‘ఆపద్భాంథవుడు’సినిమా కూడా వుంది సరిగ్గా ఆడలేదు కానీ చాలా మంది ఫ్యాన్స్ వున్నారు ఈ సినిమాకి. దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఈ సినిమాకి పెద్ద ఫ్యాన్.
‘ఆపద్భాంథవుడు’ అశ్విన్ కి చాలా ఇష్టం. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా మారి శ్రీజ ఎంటర్టైన్మెంట్ బేనర్లో `ఫస్ట్ డే ఫస్ట్ షో` అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాలో లోగోని ఆవిష్కరించారు నాగ్ అశ్విన్.
ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ ‘ఆపద్భాంథవుడు’ సినిమాని గుర్తు చేసుకున్నారు. ” ఏడిద నాగేశ్వరరావుగారు, పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ ది గొప్ప గ్రేట్ జర్నీ. అలాంటి గొప్ప సంస్థ మళ్ళీ మొదలవ్వడం చాలా ఆనందంగా వుంది. శంకరాభరణం, స్వాతిముత్యం.. ఇలా చాలా క్లాసిక్ మూవీలు వారి సంస్థ నుంచి వచ్చాయి. ఆ సినిమాలన్నీ చూశాను. వారి సినిమాల్లో ‘ఆపద్భాంథవుడు సినిమా చాలా ఇష్టం. నేను చదువుతున్న రోజుల్లో ఆ సినిమా చూశాను. కానీ అది ఆడలేదని చాలా కోపం వచ్చింది. ఎందుకు ఆడలేదో ఆర్థంకాలేదు. ఏడిద నాగేశ్వరరావు వారసులు మళ్ళీ సినిమా నిర్మాణంలోకి రావడం ఆనందంగా వుందని చెప్పుకొచ్చారు నాగ్ అశ్విన్.