వైసీపీ నుంచే కాదు ఏ పార్టీ నుంచి రాజ్యసభకు పోవడం లేదని అదానీ అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడీ స్థానం ఎవరికని వైసీపీలో చర్చ జరుగుతోంది. కానీ హైకమాండ్ మాత్రం ఏమీ చెప్పడం లేదు. కానీ మూడు మాత్రమే వైఎస్ఆర్సీపీ నేతలకు ఇస్తున్నారని మరొకటి బీజేపీ కోటాలో ఆ పార్టీ హైకమాండ్ సూచించిన వారికి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. అదానీ కుటుంబం నుంచి ఒకరి పేరును బీజేపీ సిఫారసు చేసి ఉంటుందని ఇప్పటి వరకూ భావించారు. అయితే అలాంటిదేమీ లేదని అదానీ గ్రూప్ ప్రకటనతో తేలిపోయింది.
ఇప్పుడు బీజేపీ వేరే అభ్యర్థిని సూచిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఏపీ నుంచి రాజ్యసభ పదవీకాలం పూర్తి చేసుకుంటున్న సురేష్ ప్రభు బీజేపీ నేత. టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా ఆయన బీజేపీ అభ్యర్థిగానే రాజ్యసభకు పోటీ చేసి గెలుపొందారు. అలాగే ఈ సారి కూడా వైఎస్ఆర్సీపీ.. బీజేపీకి రాజ్యసభ సీటు ఆఫర్ చేసిందని.. పేరును బీజేపీనే ప్రతిపాదిస్తుందని చెబుతున్నారు . అందుకే అదానీ తమకు సీటు వద్దని చేసిన ప్రకటన విషయంలోనూ వైఎస్ఆర్సీపీ పెద్దగా స్పందించలేదంటున్నారు.
బీజేపీ కి ఓ సీటు ఆఫర్ చేసినట్లుగా చాలా కాలం క్రితమే ప్రచారం జరిగింది. అయితే బీజేపీ ఎవరికైనా సిఫారసు చేసినా వారు వైసీపీ లో చేరి సీటు తీసుకుంటారా లేదా అన్న సందేహం ఉంది. అయితే.. బీజేపీ నిజంగానే చెబితే.. పార్టీలో చేరకపోయినా ఇండిపెండెంట్గా అయినా జగన్ అవకాశం ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. జగన్పై అలాంటి ఒత్తిడి ఉంది మరి.