ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసు అధికారుల్ని బదిలీ చేసింది. దాదాపుగా పాతిక మంది ఐపీఎస్‌లను బదిలీ చేసింది. కీలకమైన ఏసీబీ డీఐజీని మార్చింది. అదే సమయంలో పలువురికి కీలకమైన అదనపు బాధ్యతలు ఇచ్చారు. కానీ డీజీ హోదాలో ఉన్న సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు మాత్రం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఇప్పటికే ఆయన రెండు సార్లు సీఎస్‌ను కలిసి తనకు పోస్టింగ్.. పూర్తి జీతం ఇవ్వాలని కోరారు.
ప్రాసెస్‌లో పెడతామని చెప్పారు కానీ ఆయనకు పోస్టింగ్ మాత్రం ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో ఇంటలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన ఏబీవీపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పలు ఆరోపణలు చేసింది. పలు కేసులతో సస్పెన్షన్ వేటు వేసింది. రెండేళ్లు అయినా ఆయనపై కేసులు తేలకపోవడంతో సస్పెన్షన్ ఆటోమేటిక్‌గా ముగిసిందని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు తీర్పును కూడా పెద్దగా పట్టించుకోనట్లుగా కనిపిస్తోంది.
ఈ విషయంలో సుప్రీంకోర్టు ధిక్కరణకు కూడా పాల్పడేందుకు ప్రభుత్వం సిద్దమయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇంత మందిని బదిలీ చేసినా.. పోస్టింగ్ ఇవ్వకపోవడానికి అదే కారణం అని భావిస్తున్నారు.