యూపీలో జ్ఞానవాపి సమీదులో సర్వే చేస్తే శివలింగం బయటపడింది. ఇంకేముంది.. నాలుగు వందల ఏళ్ల తర్వాత అద్భుత దర్శనం దర్శించుకోండి అని వాట్సాప్ మెసెజులు హోరెత్తాయి. అందులో జ్ఞానవాపిలో దొరికిన శివలింగమేదో ఎవరికీ తెలియదు. రకరకాల ఆకారాలతో ఫోటోలు పంపేశారు. అందరూ దాని గురించే చర్చిస్తున్నారు. కానీ దేశం ఎంత గడ్డు పరిస్థితుల్లోకి వెళ్తుంతో ఎవరూ చూడటం లేదు.. చర్చించడం లేదు.
డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ భారీగా పడిపోయింది. రూపాయి ఆల్ టైమ్ కనిష్టం 77.69 వద్దకు చేరుకుంది. డాలర్ వ్యాల్యూ మరింత పెరిగితే రూపాయి మరింతగా క్షీణించే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే పెట్రోల్ , డీజిల్ వంటి దిగుమతుల రేట్లు మరింత పెరుగుతాయి. అదే జరిగితే దేశం అల్లకల్లోలం అయిపోతుంది. ఇప్పటికే ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరింది. నిరుద్యోగిత పెరుగుతోంది. భారత జీడీపీ వృద్ధి రేటు ప్రపంచం బ్యాంక్ రెండు శాతానికిపైగా తగ్గించేసింది.
దేశం అత్యంత కఠినమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. కానీ ఆ విషయంలో ప్రభుత్వం లేదా ప్రభుత్వాలు తగినంత ప్రణాళికలతో ఉన్నాయో లేదో స్పష్టత లేదు. జరిగిందేదో జరుగుతుందని తమ రాజకీయం తాము చేసుకునే పనిలో ఉన్నారు. ఇష్టారీతిన అప్పులు చేస్తూనే ఉన్నారు. మరో వైపు రాజకీయం కోసం.. శివలింగాలు వెలికి తీస్తున్నారు. అందరికీ దర్శనాలు కల్పిస్తున్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో దేశం గురించి ఎవరూ చింత పడటం లేదు. చివరికి పాలకులతో సహా