ఎఫ్ 2కి.. మూడింతలు వినోదం ఎఫ్ 3లో ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఆ మాట నిజమో కాదో తెలియాలంటే, థియేటర్లో బొమ్మ పడేంత వరకూ ఆగాలి. కాకపోతే.. ఓ విషయంలో మాత్రం మూడు రెట్లు అనేది ఖాయమైపోయింది. అదే.. వెంకీ పారితోషికం మేటరు.
ఎఫ్ 3కి వెంకీ అక్షరాలా రూ.15 కోట్లు తీసుకొన్నట్టు టాక్. వెంకీ స్టార్ హీరో అయినా సరే, ఎప్పుడూ పారితోషికం రూ.10 కోట్లు దాటలేదు. ఎఫ్ 2లోనూ వెంకీ తీసుకొన్నది రూ.5 కోట్లకుఅటూ ఇటుగానే. అయితే ఎఫ్ 3 వచ్చేసరికి రూ.15 కోట్లు పట్టుకెళ్లిపోయాడు. వరుణ్ తేజ్ పారితోషికంలోనూ అనూహ్యమైన మార్పు వచ్చినట్టు టాక్. ఎఫ్ 2 సూపర్ హిట్టవ్వడం, సీక్వెల్‌పై భారీ అంచనాలు పెరగడంతో పాటు క్రేజ్ రావడంతో… దిల్ రాజు హీరోలకు అడిగినంత ఇచ్చేశాడట. ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా 45 కోట్ల వరకూ అయ్యిందని టాక్. సునీల్, సోనాల్ లాంటి కొత్త స్టార్లు ఈ సినిమాలోకి రావడం, పూజాతో ఐటెమ్ సాంగ్ చేయించడం వల్ల… బడ్జెట్ లిమిట్ దాటేసిందని టాక్. ఎఫ్ 2తో పోలిస్తే.. బడ్జెట్ కూడా భారీగానే పెరిగింది. మరి రిటర్న్స్ ఎలా ఉంటాయో చూడాలి.