విజయవాడలో చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ అభిమానులు సమావేశం అయ్యారు. మురళీ ఫార్చున్ హోటల్ లో ఏపీలోని అన్ని జిల్లాల నుంచి పరిమిత సంఖ్యలో మెగా ఫ్యాన్స్‌ను ఆహ్వానించారు. అందరూ కలిసి జనసేన పార్టీకి ఎలా మద్దతుగా నిలవాలన్న అంశంపై చర్చించారు. ఏపీలో ముగ్గురు హీరోల అభిమానులు కలిసి సంయుక్తంగా పనిచేసి, జనసేన పార్టీని బలోపేతం చేయడం అలా అని ప్రణాళికలు వేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామినాయుడు అధ్యక్షతన నిర్వహించారు.
ప్రతి గ్రామంలో అందరూ కలిసి పని చేయాలని నిర్ణయించామని.. జనసేన ను జనంలోకి తీసుకెళ్లేలా మా వంతు కృషి చేస్తామని ప్రకటించారు.
2024లో పవన్ కళ్యాణ్ ను సిఎం ని చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. అయితే ఇది తొలి సమావేశం అని.. మరికొన్ని సమావేశాలు అనంతరం కార్యాచరణ సిద్దం చేస్తామని స్వామి నాయుడు ప్రకటించారు. అభిమానులకు, నాయకులకు మధ్య అంతరాలు లేవని పార్టీ ఆదేశాలను పాటిస్తూ ముందుకు వెళతామని ప్రకటించారు. మెగా అభిమానులు అందరూ జనసేన కార్యకర్తలు గా పని చేస్తారని ప్రకటించారు. పొత్తుల అంశంపై తమకు సంబంధం లేదని.. గతంలో ప్రజారాజ్యం పై అనేక కుట్రలు చేశారని.. కుటుంబాలు వదిలి ఆనాడు చిరంజీవి కోసం పని చేశామన్నారు.
ఇప్పుడు జనసేన పై అసత్యాలు, పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.గరి అయితే చిరంజీవి, పవన్ కల్యాణ్, రాంచరణ్‌కు విడివిడిగా అభిమానులు లేకపోయినా ముగ్గురి అభిమానుల పేరుతో సభను నిర్వహించడం ఆసక్తి రేపుతోంది. ఏపీలో రాజకీయ వేడి పెరుగుతున్నందున ఫ్యాన్స్ సేవలను గరిష్టంగా వాడుకునే ఉద్దేశంతో అభిమాన సంఘాలన్నింటినీ సమన్వయం చేసే బాధ్యతను స్వామినాయుడుకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.