ఈ వేసవి సీజన్లో రాబోతున్న మరో పెద్ద సినిమా.. ఎఫ్ 3. ఈ సినిమా విషయంలో దిల్ రాజు ఇది వరకెప్పుడూ లేని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రమోషన్లు భారీగా చేస్తున్నాడు. సినిమాకి ప్రేక్షకులు దూరం కాకూడదని, టికెట్ రేట్లు భారం కాకూడదని `రెగ్యులర్ రేట్లకే సినిమా` అంటూ దీన్ని కూడా ప్రచారంలో వాడేస్తున్నారు. ఇప్పుడు మరో కట్టుదిట్టమైన ప్లాన్ తో ముందుకొస్తున్నారు.
ఎఫ్ 3 లాంటి పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు ఫ్యాన్స్ షోలూ పడతాయి. హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో పెద్ద సినిమాలకు బెన్ఫిట్ షోల జాతర మామూలే. అయితే… ఈ షోల వల్ల ఓ ఇబ్బంది ఉంది. సినిమా బాగుంటే ఫర్వాలేదు. నెగిటీవ్ టాక్ వస్తే మాత్రం.. చాలా ఎఫెక్ట్ పడుతుంది. నెగిటీవ్ టాక్ బాగా స్పైడ్ అయిపోతే, వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందుకే.. ఇలాంటి షోలకు ఎఫ్ 3ని దూరంగా ఉంచారు. భారత కాలమానం ప్రకారం అమెరికాలోనూ అర్థరాత్రి షోలు మొదలవుతాయి. తెల్లారేసరికి… టాక్ బయటకు వచ్చేస్తుంది. ఆ టాక్ నెగిటీవ్‌గా ఉన్నా ప్రమాదమే. సో… అమెరికాలో సైతం.. తెల్లవారుఝామున షోలు లేవట. దాదాపుగా ఇండియాలోనూ, ఓవర్సీస్లోనూ ఒకేసారి షోలు మొదలయ్యేలా టైమింగ్ సెట్ చేశారని తెలుస్తోంది.