ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వకూడదని పవన్ కల్యాణ్, ఎలాగోలా చీలేలా చేయాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. పవన్ కల్యాణ్‌ను ఎలాగైనా ఒంటిరగా పోటీ చేయించేలా చూడాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో నాగబాబు కూడా చేరినట్లుగా కనిపిస్తోంది. కొద్ది రోజులుగా ఆయన మెగా ఫ్యాన్స్‌ను దువ్వుతున్నారు. మెగా ఫ్యాన్స్ వ్యవహారాలను చక్కబెట్టే స్వామినాయుడుతో విజయవాడలో ఫ్యాన్స్ సమావేశం వెనుక నాగబాబు ఉన్నారని చెబుతున్నారు.
ఇటీవల ఫ్యాన్స్‌తో పదే పదే ఇంటరియాక్ట్ అవుతున్న నాగబాబు.. పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థి అయితేనే పొత్తులకు ఒప్పుకుంటామని చెబుతున్నారు. ఆ మాటలను ఇతర ఫ్యాన్స్ ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. విజయవాడలో జరిగిన ఫ్యాన్స్ మీటింగ్ సారాంశం కూడా అదే. పొత్తులు ఉన్నా లేకపోయినా పవన్ సీఎం అభ్యర్థి అని చెబుతున్నారు. ఇదంతా ఆర్గనైడ్జ్గా జరుగుతోందని పొత్తులు పెట్టుకోకుండా చూసే వ్యూహంలో భాగం అవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ విషయంలో జనసేన ముఖ్యనేతల్లోనూ సందేహాలు ప్రారంభమయ్యాయి. నాగబాబు, ఫ్యాన్స్ మాత్రమే ఈ వాదన ఎక్కువ వినిపిస్తున్నారు. అసలు పొత్తుల గురించి ప్రాథమికంగా చర్చ జరగకుండానే ఇదంతా ఎందుకు చేస్తున్నారన్న సందేహాలు జనసేనలో వ్యక్తమవుతున్నాయి. బీజేపీ తరహాలోనే జనసేనలోనూ రెండు వర్గాలున్నాయని చెబుతున్నారు. అందులో ఓ వర్గం పూర్తిగా ప్రో వైసీపీ తరహాలో వ్యవహరిస్తున్నాయని.. అంతర్గత నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాన్స్‌ను పవనే సీఎం రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడానికి నాగబాబు వెనుక ఎవరిదైనా ప్రోత్సహం ఉందో లేదో కానీ.. ఆయన ప్రయత్నాలు మాత్రం చర్చనీయాంశం అవుతున్నాయి.