వారం, పది రోజుల పాటు ఢిల్లీ కేంద్రంగా రాజకీయ పర్యటనలు చేయాలని షెడ్యూల్ ఖరారు చేసుకుని వెళ్లిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హఠాత్తుగా హైదరాబాద్ రిటర్న్ అయ్యారు. ఢిల్లీలో అఖిలేష్‌తో భేటీ కేజ్రీవాల్‌తో రెండు రోజుల పాటు ఢిల్లీ, పంజాబ్‌లలో కార్యక్రమాల్లో పాల్గొని కర్ణాటకకు మరో చోటకు వెళ్లాలని అనుకున్నారు. అయితే ఈ సారి పర్యటనలో పంజాబ్‌లో రైతులకు సాయం అందించడంతోనే ముగించారు.
కారణాలేమిటో స్పష్టంగా తెలియకపోయినా… ఓ వైపు మంత్రి కేటీఆర్ కూడా దేశంలో లేకపోవడం .. కేసీఆర్ ఢిల్లీ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వ్యతిరేకంగా మారే అవకాశం ఉందన్న ఉద్దేశంతో కేసీఆర్ వెనక్కి వచ్చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కేటీఆర్ దావోస్ పెట్టుబడుల సదస్సులో పాల్గొంటున్నారు . కొంత మంది కీలక అధికారులు కూడా ఆయనతోపాటు వెళ్లారు. దీంతో పాలకన పడకేసిందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. మరో వైపు ఇదే అవకాశంగా విపక్షాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. అదే సమయంలో కేసీఆర్‌తో భేటీల విషయంలో ప్రాంతీయ పార్టీల అధినేతలు కాస్త ముందూ వెనుకాడుతున్నారన్న ప్రచారం ఉంది.
కేసీఆర్ వ్యూహంఏమిటో స్పష్టత రాకపోడం..రాష్ట్ర పతి ఎన్నికలకు ముందు ఎలాంటి వ్యూహాల్లోనూ తాము భాగం కాకూడదని కొంత మంది అనుకుంటూ ఉండటంతో… కేసీఆర్ పర్యటన మధ్యలోనే ఆగిపోవడానికి కారణంగా భావిస్తున్నారు. అయితే ఢిల్లీలో చెప్పినట్లుగా త్వరలో ఓ సంచలనం సృష్టించడానికి కేసీఆర్ ప్రయత్నాలు కొనసాగుతాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.