ఎమ్మెల్సీ అనంతబాబుపై పోలీసులు ఎక్కడా లేనంత సానుభూతి చూపిస్తున్నారు. అయ్యో పాపం అని బాధితులను కాకుండా ఎమ్మెల్సీలను అంటున్నారు. హత్య అంశం నుంచి ఎమ్మెల్సీని ఎలా తప్పించాలా అని తీవ్రంగా ప్రయత్నించి తప్పని పరిస్థితుల్లో కేసు నమోదు చేయాల్సి వచ్చిందన్నట్లుగా వ్యవహరించిన పోలీసులు చివరికి… ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదని చెప్పడం ప్రారంభించారు.
రూ. పాతిక వేలు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీకి బాకీ ఉన్నాడట. అందుకే ఆయనను తీసుకెళ్లాడట. మధ్యలో వాగ్వాదం జరిగితే ఎమ్మెల్సీ తోసేశాడట. సుబ్రహ్మణ్యం వెళ్లి సువ్వలపై పడటంతో తలకు తీవ్ర గాయమైందట. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు చచ్చిపోయాడని పోలీసులు చెప్పారు. మరి ఇతర గాయాలు ఎందుకయ్యాయంటే రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు చచ్చిపోయిన సుబ్రహ్మణ్యాన్ని కర్రతో చితకబాదాడట. ఇలా కాకినాడ ఎస్పీ చెప్పుకుంటూ వెళ్లిన క్రైమ్ సీన్‌ను జర్నలిస్టులు అందరూ నోరెళ్లబెట్టి వినాల్సి వచ్చింది. నెల్లూరు ఎస్పీ చెప్పిన కోర్టు స్టోరీ కననా ఇదే ఇంట్రెస్టింగ్ గా ఉంద్ సెటైర్లు పడుతున్నాయి.
అనంతబాబు సాదాసీదా వ్యక్తి కాదు. ఆయన ఎక్కడకు వెళ్లినా ఇద్దరు గన్ మెన్లు ఉంటారు. అనుచరులు ఉంటారు. ఒక్కడే ఏ పనీ చేయడు. సుబ్రహ్మణ్యాన్ని పట్టుకుని కొట్టి చంపేశారని స్పష్టంగా తెలుస్తున్నా ఉద్దేశపూర్వకంగా చంపలేదని.. పోలీసులు వెనకేసుకునే ప్రయత్నం రావడం పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చివరికి అనంతబాబు రెండు రోజుల నుంచి పోలీస్ కస్టడీలో ఉన్నప్పటికీ.. వెదుకుతున్నట్లుగా ప్రకటనలు చేసిన పోలీసులు చివరికి.. కోర్టు సమయం అయిపోయిన తరవాత ఆస్పత్రికి తీసుకెళ్లి ఇంటి దగ్గర న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ప్రతీ విషయంలోనూ గోప్యత పాటించి.. పోలీసులు ఈ కేసు విషయంలో వ్యవహరిస్తున్న తీరుతో విమర్శలకు గురవుతున్నారు.