సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగులు చాలా కాలంగా పోరాడుతున్నారు. తాడోపేడో తేల్చుకోవాలనుకుంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వారికి జీపీఎస్ విధానం అమలు చేస్తామని ఒప్పుకోవాలని చెబుతోంది. దాంతో తమకు మరింత నష్టమని వద్దే వద్దని సీపీఎస్ ఉద్యోగులు పోరాడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఉద్యోగ సంఘాలతో చర్చల పేరుతో .. తమ అనుకూల నేతలందర్నీ పిలిచి సమావేశాలు పెడుతోంది.అందులో ప్రధానంగా గతంలో ఉద్యోగుల సమ్మెను అపహాస్యం చేసిన బండి, బొప్పరాజు వంటి వారే ఉన్నారు. వారినే సమావేశానికి పిలుపుస్తున్నారు. వారికే అభ్యంతరాలు చెబుతున్నట్లుగా కనిపిస్తున్నారు. వారు అదేమీ లేదు.. తమకు సీపీఎస్ రద్దే కావాలన్నట్లుగా చెబుతున్నారు.
కానీ వీరంతా ఓ స్కెచ్ ప్రకారం వ్యవహరిస్తున్నారని సీపీఎస్ ఉద్యోగులు నమ్ముతున్నారు. బయట సీపీఎస్ రద్దు కోసం పోరాడుతున్న వారికి చర్చల్లో ప్రాధాన్యం కల్పించకుండా స్వప్రయోజనాల కోసం ఉద్యోగుల ఉద్యమాలను తాకట్టు పెట్టే నేతల్ని మాత్రం పిలవడం వెనుక కుట్ర ఉందన్న ఆరోపణలను సీపీఎస్ ఉద్యోగులు చేస్తున్నారు. గతంలోనూ ఇలాగే బెట్టు చేసినట్లుగా చేసి.. ఎలాంటి డిమాండ్లు నెరవేరనప్పటికీ సమ్మె విరమణ ప్రకటన చేశారని.. సీపీఎస్ విషయంలోనూఇలాగే చేసి… ఏదో జీవో ఇప్పించేసి.. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సంతకాలు పెట్టించేసుకుంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అందుకే సీపీఎస్ ఉద్యోగులు… బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లును నమ్మడం లేదు. వారు తమ ప్రతినిధులు కాదంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వీరితోనే వ్యవహారం సరి పెట్టాలనుకుంటోంది. ముందస్తుకు వెళ్లే ఆలోచన ఉంది.. ఒకటి రెండు, నెలల్లో ఈ సమస్యను ఏదో విధంగా తేల్చి ఎన్నికలకు వెళ్లాలని సజ్జల ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నాు.