వందలు, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు డికే ఆదికేశవులనాయుడు కుమారుడు డీకే శ్రీనివాస్. ఆయనను డ్రగ్స్ కేసులో బెంగళూరు ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోనే ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించి ఉంది. అక్కడ కూడా ప్రముఖుడే కావడంతో ఈ వార్త సంచలనం అయింది. ఆయన ఓ అపార్టుమెంట్లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటూడగా పట్టుకున్నారని తెలు్తోంది. సదాశివనగర్‌లోని ఆయన ఇంట్లో సోదాలు చేసి మరికొంత డ్రగ్స్ పట్టుబడటంతో అర్థరాత్రి కస్టడీలోకి తీసుకున్నారు. తర్వాత అరెస్ట్ చూపించారు. శ్రీనివాస్‌తో పాటు మరికొందరి ఇళ్లలో కూడా ఎన్సీబీ దాడులు చేసినట్టుగా తెలుస్తోంది.
ఆంధ్ర, కర్ణాటక నేతలకు శ్రీనివాస్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా ఎన్సీబీ అనుమానిస్తుంది. ఇక, తెలుగు, రాజకీయ సినీ ప్రముఖులతో శ్రీనివాస్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే ఆయన డ్రగ్స్ వినియోగదారా లేకపోతే…నేరుగా వ్యాపారమే చేస్తున్నారా అన్నదానిపై ఎన్సీబీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి , డీకే శ్రీనివాస్ సన్నిహిత మిత్రులని రాజకీయవర్గాల్లో ప్రచారం ఉంది.
డీకే ఆదికేశవులు నాయుడు గతంలో టీడీపీలో ఉండేవారు. ఓ సారి పార్టీని ధిక్కరించి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన చనిపోయిన తర్వాత వారి కుటుంబం మళ్లీ టీడీపీలో చేరింది. 2014లో డీకే శ్రీనివాస్ నాయుడు తల్లి సత్యప్రభ చిత్తూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో రాజంపేట పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీకి దూరంగా ఉన్నారు. 2020లో తిరుమలలో సీఎం జగన్‌ను డీకే శ్రీనివాస్ కలిశారు.