సామాజిక న్యాయం చేశామని ఓ వైపు మంత్రులను రోడ్డెక్కించిన ప్రభుత్వం సైలెంట్‌గా పదవుల్ని మాత్రం రెడ్డి వర్గానికి కట్టబెడుతోంది. అసలే సలహాదారులు ఎక్కువైపోయారని విమర్శలు వస్తున్నా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా బత్తుల బ్రహ్మానందరెడ్డి అనే మరో వ్యక్తికి సలహాదారు పదవి ఇచ్చేసింది. పర్చూరు, చీరాల రాజకీయాలను సెటిల్ చేయడానికి ప్రయత్నిస్తున్న హైకమాండ్ అక్కడ పార్టీ కోసం చాలా ఏళ్ల నుంచి ఖర్చులు పెట్టుకుని చాన్స్ కోసం చూస్తున్న బత్తుల బ్రహ్మానందరెడ్డి అనే వ్యక్తికి అర్జంట్‌గా ఏదో ఓ పదవి ఇవ్వకపోతే ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని గుర్తించింది.
వెంటనే నెలకు… ఓ నాలుగైదు లక్షల జీత భత్యాలతో పదవి క్రియేట్ చేసింది వ్యవసాయ మార్కెటింగ్, కోఆపరేటివ్ సలహాదారుడిగా నియమించేశారు. ఇది జరిగి వారం అవుతోంది. ఆయన సైలెంట్‌గా బాధ్యతలు తీసుకునే వరకూ ఎవరికీ తెలియదు. జగన్ సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను ఈ రెడ్డి నేతే చూసుకున్నారు. అయితే తర్వాత ఆయనను జగన్ పట్టించుకోలేదు. కానీ ఇటీవల ఆయన జంప్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నారని సమాచారం రావడంతో వెంటనే ప్రజాధనాన్ని జీతంగా ఇస్తూ ఓ పదవి ఇచ్చేశారు.
ఏపీ ప్రభుత్వానికి ఉన్న అనేక మంది సలహాదారుల్లో సగానికిపైగా ఇలా వైసీపీ రెడ్డి నేతలే ఉన్నారు. వారు ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటారు తప్ప… ఎలాంటి సలహాలు ఇవ్వరు. ఇచ్చినా తీసుకునేవారు ఉండరు . ఇలాంటి పదవులు భర్తీ చేసేటప్పుడు కూడా సామాజిక న్యాయాన్ని పాటించేందుకు వైసీపీ సర్కార్ ఏ మాత్రం ఆలోచన చేయదు. కానీ బయట మాత్రం తమ కంటే ఎవరూ ఎక్కువ పదవులు ఇవ్వలేదని ప్రచారం చేసుకుంటూ ఉంటారు.