దారుణ పరాజయం.. ఆ తర్వాత వేధింపులు.. ఆర్థిక మూలాలు దెబ్బకొట్టుడు.. చివరికి స్థానిక ఎన్నికల్లో పోటీ కూడా చేయలేని నిస్సహాయత… ఇలాంటి పరిస్థితుల్లో నేతలంతా జావకారిపోయారు. కానీ.. క్యాడర్ మాత్రం అంతే ఉంది. ఎవరికీ భయపడలేదు. వెన్నుచూపలేదు. ఆ విషయం మహానాడుతో మరోసారి నిరూపితమయింది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ.. ఇక ఎన్నికల కోసం పోరాటమేని.. తమ సన్నద్దతను తెలియచేయడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. లక్ష మంది వస్తారనుకుంటే… మూడు లక్షల మంది వచ్చారు.
ఎవరికి వారు వచ్చారు … బస్సులు లభించక జన సమీకరమ కూడా చేయలేదు. ఊళ్ల నుంచి ట్రాక్టర్లు.. కార్లు ఏది దొరికితే అది పట్టుకుని వచ్చారు. ఈ స్థాయిలో మహానాడు జరుగుతుందని టీడీపీ వర్గాలు కూడా ఊహించలేదు. ఇటీవలి కాలంలో అధికార పార్టీ మీడియాలో కవరేజీ లేకపోయినా సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు బాగా ఎంగేజ్ అయ్యారు. ఒకరినొకరు మోటివేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆ ప్రబావం మహానాడులో బాగా కనిపించింది.
టీడీపీ లీడర్ పార్టీ కాదని.. క్యాడర్ పార్టీ అని ముందు నుంచీ చెబుతూ ఉంటారు. ఆ విషయం ఈ మహానాడు ద్వారా మరోసారి నిరూపితమయిందని టీడీపీ నేతలు సంతృప్తి పడుతున్నారు. మహానాడుకు ప్రభుత్వం అనేక ఆటంకాలు కల్పించింది. సభకు వెళ్లిన వారి వివరాలు తెలుసుకుని పదవులు ఆపేస్తారన్న బెదిరింపులు వచ్చాయి. అయినా దేనికీ తగ్గలేదు. మొత్తంగా చూస్తే టీడీపీ వచ్చే ఎన్నికల యుద్ధానికి మంచి ప్రారంభమే చేసిందనుకోవచ్చు.