తెలంగాణలో టీడీపీ పోటీ చేసినా ఆ పార్టీకి మిగిలిన సానుభూతిపరులు ఆ పార్టీకి ఓటు వేయకుండా తమకే వేయాలంటూ ఇతర పార్టీలం ప్రచారం చేసుకునేందుకు ఫ్లాట్ ఫాం రెడీ చేసుకుంటున్నాయి. దీనికి ఎన్టీఆర్ జయంతిని చక్కగా ఉపయోగించుకున్నాయి. ఇప్పటి వరకూ ఎన్టీఆర్ జయంతిని కానీ.. వర్థంతిని కానీ పట్టించుకోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి నివాళులర్పించడం, పలు చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్, కేటీఆర్‌లు ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా ప్రస్తావించారు. అయితే కేటీఆర్ కానీ.. కేసీఆర్ కానీ ఎన్టీఆర్ ను గుర్తు చేసుకోలేదు. ఎలాంటి ప్రకటన చేయలేదు. చివరికి సోషల్ మీడియాలో కూడా స్పందించలేదు.
తెలంగాణలో ఉన్న వైసీపీ మద్దతు సామాజికవర్గం గతంలో టీఆర్ఎస్ కు సపోర్ట్ చేసింది. ఇప్పుడు వారు ఎన్టీఆర్ ను పొగిడితే ఆ సామాజికవర్గానికి ఆగ్రహం వచ్చే చాన్స్ ఉంటుంది. తమను దూరం పెడతారని అనుకుంటారని.. కేసీఆర్, కేటీఆర్ ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించలేదని భావిస్తున్నారు. అంటే రెండువర్గాలనూ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నమాట. టీడీపీ ఓటు బ్యాంకు కనీసం 40 నియోజక వర్గాల్లో గణనీయంగా ఉందని.. బీజేపీ కూడా భావిస్తోంది. గతంలో ఎన్టీఆర్ ఘాట్‌పై అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు బండి సంజయ్ దూకుడుగా స్పందించారు. ఎన్టీఆర్ ఘాట్‌ను రక్షించుకుంటామంటూ ప్రకటనలు చేశారు.
తెలుగుదేశం పార్టీ అభిమానుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక రేవంత్ రెడ్డి అంటే టీడీపీ ఫ్యాన్స్‌లో ప్రత్యేకమైన అభిమానం ఉంది.ఇతర పార్టీల నేతలు అందుకే ఆయనను చంద్రబాబు ఏజెంట్ అన్నా రేవంత్ .. రాజకీయం కోసమైనా విమర్శలు చేయడం లేదు. ఈ కారణంగా కొంత వరకూ రేవంత్ రెడ్డిపై సానుకూలత ఉంది. దీన్ని ఆయన ఓట్లుగా మల్చుకునేందుకు ముందు ముందు చేయాల్సిన పనులు చేయకుండా ఉండరు. మొత్తంగా చూస్తే టీడీపీ ఓటర్లు.. ఇతర పార్టీలకు హాట్ కేక్‌లుగా మారారని అనుకోవచ్చు.