రుషికొండను తొలగించి ఎలాగైనా అక్కడ కట్టాలనుకున్నది కట్టాలనుకుంటున్న ప్రభుత్వం సుప్రీంకోర్టుకూ పచ్చి అబద్దాలు చెప్పడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. . యాభై శాతం నిర్మాణాలు పూర్తయ్యాయని సుప్రీంకోర్టుకు తెలిపింది ఏపీ ప్రభుత్వం. తవ్వకాలపై ఎన్జీటీ ఇచ్చిన స్టేను తొలగించడానికి ఇలా చెప్పింది. సుప్రీంకోర్టుకూడా నిజమేననుకుంది. ఒక వేళ పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని తేలిస్తే కూల్చివేస్తారా అని ప్రశ్నించింది. కానీ ప్రభుత్వం చేసిన వాదన ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే అక్కడ అసలు ఎలాంటి నిర్మాణాలు ఇంకా ప్రారంభం లేదు. తవ్వకాలే జరుగుతున్నాయి.
రుషికొండలో నిజానికి అక్కడ టూరిజం ప్రాజెక్ట్ కట్టబోతున్నామని చెబుతున్నారు కానీ.. ఏం టూరిజం ప్రాజెక్టో ఎవరికీ తెలియదు. అయితే రుషికొండను మాత్రం తొలిచేస్తున్నారు. అనుమతులు చట్ట ప్రకారం తీసుకుని … తవ్వకాలు మాత్రం ఇష్టారీతిన చేస్తున్నారు. దీనిపైనే విమర్శలు , ఆరోపణలు వస్తున్నాయి. పర్యావరణానికి తీవ్ర ఆటంకాలు కల్పిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణాలు పూర్తి చేయడానికి సుప్రీంకోర్టుకు యాభై శాతం నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. అసలు నిర్మాణాలు ప్రారంభం కాకుండానే.. తవ్వకాలు జరుపుతూండంగానే… ఇంకా యాభై శాతం పూర్తయినట్లుగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తే …న్యాయస్థానం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టునే తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించడాన్ని సీరియస్గా తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ వ్యవహారంలోఉన్న అధఇకారులు ఇరుక్కుపోవడం ఖాయమని చెబుతున్నారు.