ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ జనసేన పార్టీపై ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలపై కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తలు తమ ఆందోళలను పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇటీవలి కాలంలో పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. అవి పెద్దగా ప్రచారంలోకి రావడం లేదు. కానీ ఇలాంటివి పదుల సంఖ్యలో ఘటనలు వెలుగులోకి వస్తూండటంతో పార్టీ పెద్దలు కూడా విషయాన్ని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. క్యాడర్‌కు ఏర్పడిన కష్టాన్ని సీరియస్‌గా తీసుకున్న పవన్ కల్యాణ్ నేరుగా డీజీపీని కలవాలని భావిస్తున్నారు. ఈ మేరకు తమ నేతలపై పెట్టిన తప్పుడు కేసుల వివరాలను సేకరించాలని ఆదేశించారు.
ఇప్పటికే జనసేన నేతలు .. తమ క్యాడర్‌పై పెట్టిన కేసుల వివరాలను సేకరిస్తున్నారు. దాదాపుగా వందకుపైగానే ఉన్నట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇవన్నీ రాజకీయంగా వారిపై ఒత్తిడి పెంచడానికి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండటానికి చేసిన హెచ్చరికలుగానే జనసేన అగ్రనేతలు చూస్తున్నారు. ఈ వివరాలన్నింటితో పవన్ కల్యాణ్ డీజీపీ ద్గగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సమయం కావాలని డీజీపీని జనసేన వర్గాలు అడిగాయి. అయితే.. డీజీపీ ఆయనకు అవకాశం ఇస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం ఏపీలో డీజీపీ స్థాయి అధికారులు విపక్షాల వినతి పత్రాలుతీసుకోవడం కూడా ఎప్పుడో ఆగిపోయింది.
గౌతం సవాంగ్ డీజీపీ గా ఉన్న సమయంలో అయితే… రాజకీయ ప్రకటనలతో ప్రెస్ మీట్లు కూడా నిర్వహించేవారు. ఇప్పుడు కొత్త డీజీపీ వచ్చిన తర్వాత పరిస్థితి ఏమిటన్నది ఇంకా స్పష్టత లేదు. పవన్ కు డీజీపీ సమయం ఇస్తారా లేదా అన్నది జనసేన వర్గాలకూ ఉత్కంఠగా మారింది.