`మేజర్` ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. పది రోజులకు ముందే ప్రీమియర్లు మొదలెట్టి.. ఓ కొత్త పంథా సృష్టించింది చిత్ర బృందం. గురువారం హైదరాబాద్‌లో ప్రీమియర్ షోలు ప్రదర్శించబోతున్నారు. ఇప్పటికే ప్రీమియర్ షోల టికెట్లన్నీ బుక్ అయిపోయాయి. ఈ సినిమాకి మహేష్ ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ వెనుక మహేష్ ఉండడం బాగా కలిసొచ్చింది. తను కూడా మేజర్ ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా, ఈ సినిమా విషయంలో మహేష్ ఓ కీలకమైన సలహా ఇచ్చాడట. `మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్` కథని తెరపైకి తీసుకుని రావాలనుకున్నప్పుడు ఈ ఆలోచనను ముందు మహేష్ తో పంచుకొన్నాడట శేష్. ”మీలాంటి వాళ్లు ఈ ప్రాజెక్ట్ వెనుక ఉంటే బాగా హెల్ప్ అవుతుంది” అని అడవిశేష్ అడగ్గానే…మహేష్ `ఓకే` చెప్పాడట. అయితే..’గూఢచారి టీమ్ తో కలిసి చేస్తే.. నీకు బాగా హెల్ప్ అవుతుంది.. వాళ్లనే నీ టీమ్ లో తీసుకో’ అని మహేష్ సలహా ఇచ్చాడట. దాంతో.. ‘గూఢచారి’ టీమ్‌ని.. అడవిశేష్ `మేజర్` కోసం రిపీట్ చేయాల్సివచ్చింది. మహేష్‌కి `గూఢచారి` సినిమా అంటే చాలా ఇష్టం. అందులోని స్టైలిష్మేకింగ్ చూసి ఫిదా అయిపోయాడట. అందుకే ‘గూఢచారి’ టీమ్ ని తీసుకోమని సలహా ఇచ్చాడు. దాన్ని అడవిశేష్ తు.చ. తప్పకుండా పాటించేశాడు. గూఢచారికి పనిచేసిన దర్శకుడ్ని, డీఓపీని, ఎడిటర్‌నీ.. ఇలా దాదాపు సగం మందిని `మేజర్` టీమ్ కోసం తీసుకొన్నాడు. ఈ ప్లాన్ కూడా బాగా వర్కవుట్ అయినట్టే కనిపిస్తోంది. ఆల్రెడీ అడవిశేష్ తో పనిచేసిన వాళ్లే కాబట్టి.. శేష్ తో త్వరగా కనెక్ట్ అయిపోయారు. ఆ కెమిస్ట్రీ… ఈ సినిమాకి బాగా ఉపయోగపడింది.