తెలంగాణలో అధికారం చేపట్టడానికి బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కేసీఆర్‌ను ఫ్రస్ట్రేషన్‌కు గురి చేస్తూ ఇప్పటికే అనేక రకాల వ్యూహాలు అమలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలోనే నిర్వహించాలని నిర్ణయించారు. జులై నెలలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. మూడు రోజల పాటు హైదరాబాద్‌లో జరిగే ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాతో పాటుగా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా హైదరాబాద్‌కు రానున్నారు.
ఈ సమావేశాల కోసం ప్రధాని మోదీ, అమిత్ షా మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోనే బస చేయనున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తే దేశం మొత్తం చూపు తెలంగామ వైపే ఉంటుంది. జాతీయ రాజకీయాల్లో బీజేపీని దెబ్బకొట్టాలని ఒకరి రెండు నెలల్లో సంచలనం నమోదు చేస్తానని కేసీఆర్ చెబుతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టి గెలిపించడమే సంచలనంగా చాలా మంది భావిస్తున్నారు.
ఈ క్రమంలో కేసీఆర్ వచ్చే నెలకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో కానీ… తెలంగాణలోనే మకాం వేస్తామని మోదీ, అమిత్ షా నేరుగా కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లోనే ప్లాన్ చేశారు. బీజేపీకి కేసీఆర్ ఎలా కౌంటర్ ఇస్తారో వేచి చూడాల్సి ఉంది. దేశం మొత్తం తెలంగాణలో బీజేపీ వైపు చూస్తూంటే… ఆ అటెన్షన్‌ను తనవైపు తిప్పుకునేలా కేసీఆర్ రాజకీయం చేస్తారని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.