పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సినిమాలకు స్వస్థి చెబుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 2018లో తన చివరి సినిమా ఉంటుందని ఆ తర్వాత తను స్థాపించిన జనసేన పార్టీ బలోపేతం చేసేందుకు వ్యూహ రచనలు చేస్తున్నాడని అంటున్నారు. అయితే ప్రజాసేవ చేసేందుకు సిద్ధమైన పవన్ ఏదో ఒకరోజు సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టక తప్పదు. కాని పవన్ ప్రస్తుతం 100 కోట్లు కూడబెట్టే పనిలో ఉన్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఆ 100 కోట్లు సమకూర్చేందుకే తను తొందరగా సినిమాలు చేస్తూ ఈరోస్ వారికి అమ్మేస్తున్నాడని రూమర్స్ వస్తున్నాయి. అంతేకాదు సర్దార్ తర్వాత చేసే సినిమాను కూడా ఈరోస్ వారి నిర్మాణంలోనే చేస్తాడట. అయితే అన్ని బాగానే ఉన్నా పవన్ 100 కోట్ల టార్గెట్ ఎందుకు అంటే 2019 ఎన్నికల టైంకు జనసేనను రంగంలో దించేలా చేసే ఆలోచనల్లో భాగంగానే డబ్బు ఉంటే పార్టీకి కావాల్సిన సహకారం ఇంకా మిగతా పనులు కూడా అవుతాయనే ఆ డబ్బుని కూడబెట్టబోతున్నాడట పవన్ కళ్యాన్.
ఇక సినిమాలకు పూర్తిగా స్వస్థి చెప్పి ఫుల్ టైం రాజకీయం చేయనున్నారు పవన్ కళ్యాన్. మరి పవన్ కళ్యాన్ మీద వస్తున్న ఈ వార్తలన్ని నిజమా కాదా అని తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.